ETV Bharat / state

Voters List Without Correction of Irregularities In AP: అవకతవకలు సరిదిద్దకుండానే ఓటర్ల ముసాయిదా జాబితా.. విడుదలకు ఈసీ యత్నాలు!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 9:13 AM IST

Voters List Without Correction of Irregularities In AP: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలు సరిదిద్దకుండానే ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు పట్టించుకోరా? అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోరా? వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన, విచారణ చేయకుండానే ముసాయిదా జాబితా సిద్ధం చేయటం ఏంటి? అధికార వైఎస్సార్సీపీ నాయకులు, వాలంటీర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై చేర్చిన లక్షల బోగస్‌ ఓట్లను అలాగే ఉంచేస్తారా? వాటిని తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి లేదా అనే ప్రశ్నలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం కాదా? అని నిలదీస్తున్నారు.

Voters List Without Correction of Irregularities In AP

Voters List Without Correction of Irregularities In AP: అవకతవకలు సరిదిద్దకుండానే ఓటర్ల ముసాయిదా జాబితా..విడుదలకు ఈసీ యత్నాలు!

Voters List Without Correction of Irregularities In AP : రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులకు చెందిన లక్షల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు ధ్రువపత్రాలతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్రమమార్గాల్లో పెట్టిన ఫారం-7 దరఖాస్తులను పట్టుకుని అర్హులైన ఓటర్లను బలి చేయడమేంటి అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. సున్నా, అసంబద్ధ డోర్‌ నంబర్ల చిరునామాలతో నమోదై ఉన్న 27.13 లక్షల అనుమానాస్పద ఓట్ల గుట్టు పూర్తిగా తేల్చకుండానే ముసాయిదా జాబితా విడుదల చేయడానికి సిద్ధమవడమేంటి అన్న ప్రజల గట్టిగా ప్రశ్నిస్తున్నారు.

TDP Leaders Allegations on Voter List : ప్రతిపక్ష పార్టీలకు చెందిన లక్షల ఓట్లు తీసేసి, అధికార పార్టీ నాయకులు సమర్పించిన దరఖాస్తులకు అనుగుణంగా లక్షల బోగస్‌ ఓట్లు చేరిస్తే ప్రజాస్వామ్యం అనే పదానికి అసలు అర్థముంటుందా? ఒక్క ఓటు తేడాతో ఎన్నికల్లో గెలుపోటములు తారుమారైపోతుంటాయి. అందులోనూ రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. ఈ పరిస్థితుల్లో లక్షల ఓట్లకు సంబంధించి అవకతవకలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంటే వాటిని పూర్తిగా సరిచేయకుండానే ముసాయిదా జాబితా విడుదల చేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం కాదా? ఎన్నికల సంఘానికి ఇది ఎందుకు పట్టడం లేదు? దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అసాధారణ పరిస్థితులు ఏపీలో నెలకొన్న రీత్యా ముసాయిదా జాబితా విడుదల గడువు ఎందుకు పొడిగించరని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

Irregularities in AP Voter List: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల జాబితాలో అక్రమాలు.. నయా ఆయుధం 'ఫామ్‌-7'తో వైసీపీ సర్కార్..

Illegal Votes in AP: ముందుగా ప్రకటించినట్లు అక్టోబరు 27నే ముసాయిదా జాబితా విడుదల చేయాల్సిన అవసరం ఏముంది? ఆ గడువు ఎందుకు పొడిగించరు? ప్రతిపక్షాల ఫిర్యాదులు, గుర్తించిన అక్రమాలు, అవకతవకలు అన్నింటిపైనా క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ పూర్తి స్థాయిలో చేపట్టి అనుమానాలన్నింటినీ నివృత్తి చేసిన తర్వాతే ముసాయిదా జాబితా విడుదల ఎందుకు చేయరు?

Irregularities in AP Voter List : అక్రమాలను సరిదిద్దకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 27.13 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. వీటిల్లో సున్నా, అసంబద్ధ డోర్‌ నంబర్‌లతో 2 లక్షల 51 వేల 767 ఓట్లు ఉన్నాయి. ఒకే డోర్‌ నంబర్‌లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్ల సంఖ్య లక్షా 57 వేల 939 కాగా వాటిల్లో 24 లక్షల 61వేల 676 ఓట్లు నమోదై ఉన్నాయి. ఈ అనుమానాస్పద ఓట్ల పరిశీలన ఇప్పటికీ సమగ్రంగా జరగలేదు.

Villagers Fight For Their Right to Vote in AP: ఓటు హక్కు కోసం.. రెండు గ్రామాల ప్రజల పోరాటం..

Suspicious Votes in State : ఒకే వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉంటే వాటిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా తొలగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ.. వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, వారి కుటుంబీకులకు సంబంధించిన డబ్లింగ్‌ ఓట్లు మాత్రం జాబితాలో కొనసాగుతున్నాయి. పర్చూరు, కావలి, పిఠాపురం, గురజాల సహా రాష్ట్రంలోనే అనేక నియోజకవర్గాల్లో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారులకు సంబంధించిన లక్షల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధ్రువీకరణలు, అసత్య సమాచారంతో వైసీపీ నాయకులు భారీగా ఫారం-7 దరఖాస్తులు పెట్టారు. దీంతో లక్షల మంది అర్హుల ఓట్లకు ముప్పు పొంచి ఉంది.

ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు లేకుండా చేశారు. దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి చనిపోయిన వారికి మాత్రం కొనసాగించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్ల జాడ ప్రస్తుత జాబితాలో దొరక్కుండా చేశారు.

ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలో మరికొందరివి మరో పోలింగ్‌ కేంద్రంలో పరిధిలో చేర్చారు. కొన్ని కుటుంబాలకు సంబంధించి మొత్తం అందరి ఓట్లూ గల్లంతైన పరిస్థితులూ ఉన్నాయి. మరోవైపు ఒకే డోర్‌ నంబర్‌లో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు నమోదు చేశారు. వీటిపై వందల ఫిర్యాదులున్నాయి. వీటిపై సమగ్ర విచారణే జరగలేదు. ఇన్ని లోపాలు పెట్టుకుని వాటిని సరిదిద్దకుండా ముసాయిదా జాబితా విడుదల చేయటం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలగదా అని ఈసీని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు నాలుగుసార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం అయిదోసారి ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. అయినా ఇప్పటికీ జాబితాలో అక్రమాలు, అవకతవకలు కొనసాగుతున్నాయి. ఈ సారి కూడా వాటిని అలాగే కొనసాగిస్తూ ముసాయిదా జాబితా విడుదల చేస్తే ఎలా? ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం కాదా? ఇప్పటికైనా సరే యుద్ధప్రాతిపదికన అక్రమాలు, అవకతవకలన్నింటినీ సరిదిద్ది.. ఆ తర్వాతే ముసాయిదా జాబితా విడుదల చేయాలన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

Cases Filed on False Form 7 Applicants అధికార పార్టీ నయా ఆయుధం ఫారం-7! కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.