ETV Bharat / state

దుర్గామల్లేశ్వరస్వామి బ్రహ్మోత్సవ కల్యాణోత్సవానికి సిద్దమవుతోన్న ఇంద్రకీలాద్రి

Brahmotsavam at Indrakeeladri: శ్రీరామనవమిని పురస్కరించుకుని ధర్మపథం కల్యాణ వేదిక వద్ద సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు దుర్గామల్లేశ్వరస్వామి వారికి బ్రహోత్సవ కల్యాణం జరుగనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అందుకు తగట్లుగా.. భక్తులకు ఎలాంటి ఇబ్బుందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు.

Brahmotsavam at  Indrakeeladri
ఇంద్రకీలాద్రి
author img

By

Published : Mar 30, 2023, 5:33 PM IST

Brahmotsavam celebrations start on April 1: సర్వశక్తిస్వరూపిణి, జగన్మాత కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి బ్రహ్మోత్సవ కల్యాణ మహోత్సవాలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు దుర్గామల్లేశ్వరస్వామి వారికి బ్రహోత్సవ కల్యాణం ఆగమోక్తంగా జరగనుంది. ఈనెల 22న ప్రారంభమైన వసంత నవరాత్రోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని ధర్మపథం కల్యాణ వేదిక వద్ద సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు దంపతులు, పాలక మండలి సభ్యులు, ఈవో ధర్బముళ్ల భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కనకాంబరాలు, ఎర్రగులాబీలతో ప్రత్యేక పూజ చేశారు.

రేపు ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో వసంత నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీరాముల పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి దుర్గామల్లేశ్వరస్వామి బ్రహోత్సవ కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు మంగలస్నానాలు, వధూవరులుగా ఆదిదంపతుల అలంకరణ, సాయంత్రం విఘ్నేశ్వరపూజ, అంకురార్పణ, ధ్వజారోహనం ఉంటాయి. ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మూల మంత్ర హవనాలు ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి. మూడో తేదీ ఉదయం ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి పదిన్నర గంటలకు దివ్య కల్యాణం జరగనుంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక్కో వాహనంపై నగరోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఒకటో తేదీన వెండి పల్లకీసేవ, రెండో తేదీ రావణ వాహన సేవ, మూడో తేదీ నందివాహన సేవ, నాలుగో తేదీ సింహవాహన సేవ, ఐదో తేదీ వెండి రథోత్సవం జరగనున్నట్లు దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ వెల్లడించారు.

'దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతా, రామ కల్యాణం నిర్వహించాం. భద్రచలంలో జరిపినట్లుగా అందరం కలిసి చాలా చక్కగా కల్యాణం నిర్వహించడం జరిగింది. ఉగాది నుంచి ప్రారంభమైన వసంత నవరాత్రులు రేపటితో ముగుస్తాయి. పుర్ణాహుతి అయిన తురువాత ఇంద్రకీలాద్రి బ్రహ్మోత్సవ కల్యాణ మహోత్సవాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు సాగుతాయి. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామి అమ్మవార్లను ఒక్కో వాహనంపై నగరోత్సవం నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బుదులు రాకుండా చూసుకుంటాం. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద యేత్తున పాల్గొంటారని ఆశిస్తున్నాం'- ధర్భముళ్ల భ్రమరాంబ, దుర్గగుడి ఈవో

ఇంద్రకీలాద్రిపై కన్నులపండువగా సీతారాముల కల్యాణం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.