ETV Bharat / state

Road Accident Accused Arrest: కారు బీభత్సం కేసులో నిందితుడు అరెస్ట్.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Vijayawada Road Accident Accused Arrest: విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన లక్ష్మణ్ అనే యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 13, 2023, 8:02 AM IST

విజయవాడ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Vijayawada Road Accident Accused Arrest: బీఆర్టీఎస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించిన కేసులో నిందితుడు జమీర్ బాషాను గుణదల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ్ అనే యువకుడు మృతి చెందగా శ్రీనివాస్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం లక్ష్మణ్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనంతరం అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది.. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున వైసీపీ నేతకు చెందిన కారు బీభత్సం సృష్టించింది. విజయవాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా ప్రధాన అనుచరుడు జమీర్ బాషా మితిమీరిన వేగంగా కారును నడుపుతూ.. ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో లక్ష్మణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీనివాస్ అనే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మద్యం బాటిళ్లు ఉండడంతో వాటిని తాగి మితిమీరిని వేగంతో నడిపినట్టు తెలుస్తోంది. కానీ.. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కారులో మద్యం సీసాలే లేవని చెబుతున్నారు. ఈ కారుపై ఎమ్మెల్సీ అధికారిక స్టిక్కర్లు అంటించి ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి జమీర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కొంతమంది యువకులు ఘటనా స్థలానికి చేరుకుని కారుపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్లను తొలగించారు. వీరంతా రుహుల్లా అనుచరులేనని తెలుస్తోంది.

Tractor Accident several Dead: గుంటూరులో ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురు మృతి.. మరో ఏడుగురికి గాయాలు..

విజయవాడలోని పటమట రామలింగేశ్వర్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్‌ డిగ్రీ రెండో ఏడాది ప్రైవేటుగా చదువుతున్నాడు. తండ్రి అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచంపైనే ఉండడం, తల్లి గృహిణి కావడంతో కుటుంబానికి లక్ష్మణే ఆధారం. పగలంతా అద్దాల పని చేస్తూ.. రాత్రి నుంచి ఉదయం వరకూ ర్యాపిడో బైక్‌ టాక్సీని కూడా నడుపుతుంటాడు. శ్రీనివాసరావు అనే యువకుడు హైదరాబాద్‌ నుంచి ఆదివారం తెల్లవారుజామున విజయవాడకు వచ్చాడు. రామవరప్పాడుకు వెళ్లేందుకు లక్ష్మణ్‌ బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి వెళుతుండగా.. బీఆర్‌టీఎస్‌ భానునగర్‌ కూడలి దాటిన తరువాత వెనుక నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వైసీపీ నేత జమీర్‌ కారు వీరిని ఢీకొట్టింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని సుమారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది. రోడ్డంతా రక్తసిక్తమైంది. కారు టైరు గుర్తులు స్పష్టంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్టు కనిపిస్తున్నాయి. లక్ష్మణ్‌ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. వెనుక కూర్చున్న శ్రీనివాసరావుకు గాయాలవ్వడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పనిచేస్తే ఎంతోకొంత ఆదాయం వస్తుందని చెప్పి వెళ్లిన తన కొడుకు తెల్లారేసరికి శవమయ్యాడంటూ.. లక్ష్మణ్‌ తల్లి బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.

Road Accident In Paderu: బంధుమిత్రులతో ఆనందంగా గడిపిన దంపతులు.. అంతలోనే ఆవిరి

ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినడంతో సెన్సర్లు పనిచేయక నిలిచిపోయింది. దీనివల్లే అక్కడ కారును వదిలేసి జమీర్‌ పరారయ్యాడు. లేదంటే కారును అక్కడి నుంచి తీసుకుని ఆపకుండా వెళ్లిపోయేవాడేనని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొంతదూరం ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను వెళ్లిన తర్వాత కొంతమంది యువకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుపై అతికించి ఉన్న అన్ని స్టిక్కర్లను తొలగించారని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్‌ ఉండేదని, తర్వాత కనిపించలేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కారుకు ఉండాల్సిన ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను కూడా తొలగించేయడం గమనార్హం. ప్రమాదానికి కారణమైన ఏపీ39సీఎల్‌0786 నంబరు గల కారు జమీర్‌ సోదరి షేక్‌ నగీనా పేరుతో ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారులో డ్రైవరు సీటు పక్కనే ఒకటి, డోరుకున్న అరలో మరొకటి బీరు సీసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు తీసిన వీడియోలు, ఫొటోల్లో ఈ మద్యం సీసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ.. పోలీసులు మాత్రం ఎలాంటి మద్యం సీసాలు కనిపించలేదంటూ చెప్పడం చూస్తే.. ఈ కేసును కావాలనే నీరు గార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోంది.

Road Accident: గూడూరు హైవేపై రోడ్డు ప్రమాదం.. మృత్యుంజయుడిగా రెండేళ్ల బాలుడు..

రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిందని ఏసీపీ తెలిపారు. జమీర్‌ భాషా అనే వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు. నాపరాళ్ల వ్యాపారం చేసే జమీర్‌ సోదరి పేరుతో కారు రిజిస్టరైందని.. ఎమ్మెల్సీకి ఈ కారుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మద్యం సీసాలు ఉన్నాయన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు జమీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. అతనికి డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్ష కూడా నిర్వహిస్తామన్నారు. కారుతో తనకు సంబంధం లేదని, కానీ.. దానిని నడుపుతున్న జమీర్‌ తన మనిషేనని వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా తెలిపారు. జమీర్‌ తండ్రి నన్నేషా తమ పార్టీలో సీనియర్‌ నాయకుడని అన్నారు. ఆయన చనిపోయిన తర్వాత నుంచి జమీర్‌ తనతోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని రుహుల్లా తెలిపారు. ఏపీ39సీఎల్‌0786 నంబరు కారు జమీర్‌ సోదరి షేక్‌ నగీనా పేరుతో ఉందని ఆయన అన్నారు. గతంలో తనకు మూడు ఎమ్మెల్సీ స్టిక్కర్లు వస్తే వాటిలో ఒకటి జమీర్‌ కారుకి అంటించిన మాట వాస్తవమేనన్నారు. కానీ.. తరువాత దానిని తొలగించామన్నారు. జమీర్‌కు కరెన్సీనగర్‌లో ఇల్లు ఉండడంతో ఆదివారం తెల్లవారుజామున అక్కడికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత జమీర్‌ బంధువులు తనకు ఫోన్‌ చేయగా వారిని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమని చెప్పాను. పోలీసులతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించానంటూ రుహుల్లా వెల్లడించారు.

నా కొడుకు ఒకవైపు చదువుకుంటూనే మా ఇంటికి ఆధారంగా ఉన్నాడని మృతుని తల్లి తెలిపింది. ఇంక మా కుటుంబానికి దిక్కెవరని బోరునవిలపిస్తోంది. తన కొడుకు లక్ష్మణ్ రోజంతా ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాడని.. ఖాళీ దొరకగానే చదువుకుంటూ ఉంటాడని కన్నీరుమున్నీరు అయింది. లక్ష్మణ్ తన తమ్ముడు వికాస్‌ను కూడా చదివిస్తున్నాడని తెలిపింది. ర్యాపిడో పికప్‌ ఉందని చెప్పి శనివారం రాత్రే వెళ్లిపోయాడని, తెల్లవారైనా తిరిగి రాకపోవటంతో ఫోన్‌ చేశామని చెప్పింది. అప్పుడే పోలీసులు తమకు ఈ విషయం చెప్పారని, దీనికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.