ETV Bharat / state

'పదవులు ఐదేళ్లే.. రంగా అబ్బాయిగా ఉండటమే గొప్ప' - ఏపీ రాజకీయ వార్తలు

Vangaveeti Mohana Ranga Statue Inaugration: వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణను ఓన్‌ చేసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు నున్న సెంటర్‌లో కారు దిగి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి దండ వేయగా.. రాధా మాత్రం కారు దిగలేదు. పదవులు ఐదేళ్లే ఉంటాయని తనకు రంగా అబ్బాయిగా ఉండటమే గొప్ప అని.. వంగవీటి రాధాకృష్ణ అన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం వంగవీటి రంగా ప్రాణత్యాగం చేశారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Ranga
Ranga
author img

By

Published : Dec 25, 2022, 10:12 PM IST

Updated : Dec 25, 2022, 10:59 PM IST

Vangaveeti Mohana Ranga Statue Inaugration In Vijayawada: వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణను ఓన్‌ చేసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సోమవారం రంగా వర్ధంతి జరగనున్న నేపథ్యంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ రాధా కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఒకే కారులో ఎంపీ బాలశౌరి, రాధా, వంశీ, నానీ నున్న వెళ్లారు. వైసీపీ నేతలు నున్న సెంటర్‌లో కారు దిగి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి దండ వేయగా.. రాధా మాత్రం కారు దిగలేదు. నేరుగా రంగా విగ్రహావిష్కరణ సభావేదిక వద్దకు వెళ్లిపోయారు.

పదవులు ఐదేళ్లే ఉంటాయని తనకు రంగా అబ్బాయిగా ఉండటమే గొప్ప అని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. తన తండ్రి ఆశయాల‌ కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం పని చేస్తూ ఉంటానని రాధా తెలిపారు. నున్న సెంటర్‌లో వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణలో రంగ తనయుడు రాధాకృష్ణ, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం వంగవీటి రంగా ప్రాణత్యాగం చేశారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

నున్న సెంటర్‌లో వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ

ఇవీ చదవండి

Last Updated : Dec 25, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.