ETV Bharat / state

టిడ్కో ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు - Gudivada TIDCO Houses

టిడ్కో ఇళ్లు పేదలను ఊరించి ఊసూరుమనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రారంభమై 70 శాతం పూరైన పనులను.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలిక్కి తేవడం లేదు. పక్కా గృహాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు నిరాశ, నిట్టూర్పే మిగులుతోంది. ఒక్కో ఇంటికి లక్షల రూపాయలు అప్పులు చేసి డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులు.. ఇప్పుడు వాటికి వడ్డీలు కట్టలేక అల్లాడుతున్నారు.

Tidco_Houses_Beneficiaries_Problems_in_Vijayawada

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 11:10 AM IST

Updated : Nov 4, 2023, 1:08 PM IST

టిడ్కో ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు

Tidco Houses Beneficiaries Problems in Vijayawada : టిడ్కో ఇళ్లు పేదలను ఊరించి ఊసూరుమన్పిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్లు ఇప్పటికీ నత్తనడకన సాగుతూ అసంపూర్తిగా మిగిలాయి. పక్కా గృహాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు నిరాశ, నిట్టూర్పే మిగులుతోంది. కేటగిరీ ఆధారంగా ఒక్కో ఇంటి కోసం లబ్ధిదారులు వేలాది రూపాయలు అప్పులు చేసి డిపాజిట్లు కట్టగా.. ఇప్పుడు వడ్డీలు కట్టలేక.. మరోవైపు ఇళ్ల అద్దెలు (Rent House) భరించలేక అల్లాడుతున్నారు.

Vijayawada Tidco Houses Incomplete : విజయవాడ నగర పరిధిలోని వేలాది మంది పేదలకు జక్కంపూడి, షాబాద ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు కేటాయించారు. మొదటి విడతగా ఆ ప్రాంతంలో 10 వేల మందికి గృహాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 8 వేల మందికి గత ప్రభుత్వ హయాంలోనే కేటాయింపులు చేశారు. 6 వేల గృహాల నిర్మాణాలను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని గృహాలను 70 శాతం మేరకు పూర్తి చేశారు.

No Distribution of Tidco Houses: టిడ్కో గృహ నిర్మాణాల రుణాలు.. చెల్లించాలని లబ్దిదారులకు బ్యాంకర్ల నోటీసులు

Tidco Houses Incomplete in Andhra Pradesh : టిడ్కో ఇళ్లుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నీలి రంగును వేసింది. మిగిలిన వాటి పనులను మాత్రం ప్రారంభించలేదు. ఆ గృహాల వద్ద పిచ్చిమొక్కలు మొలిచి అధ్వానంగా కన్పిస్తున్నాయి. అనేక గృహాల వద్ద పైపులైన్లు పగిలిపోయాయి. టైల్స్ విరిగిపోయాయి. కొన్నిచోట్ల తలుపులు, కిటికీలు అపహరణకు గురయ్యాయి. టిడ్కో గృహాలను పూర్తిచేసి అప్పగిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు హామీ ఇస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు.

Titko Houses Beneficiaries Staying in Rented House : టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు అంతా ఎక్కువ మంది పేదలే. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. వీరంతా అద్దె ఇళ్లల్లో ఉంటూ నెలకు వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారు. మరో వైపు టిడ్కో ఇళ్ల డిపాజిట్ కోసం అప్పు చేసిన మొత్తానికి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోనీ డిపాజిట్లు వెనక్కి తీసుకుందామన్నా వీలుకాని పరిస్థితి నెలకొంది. టిడ్కో ఇళ్లను ఎప్పుడు పూర్తి చేస్తారో వారికి ఎప్పుడు అప్పగిస్తారో తెలియడం లేదు. తమ బతుకులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే టిడ్కో గృహాలను పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

AP TIDCO Houses: టిడ్కో భూముల అమ్మకం.. పేదల్ని కొట్టే ఇళ్లు కట్టాలా..?

Political Leaders Fire on Cm Jagan : వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ టిడ్కో గృహాలను పూర్తి చేసి ఇస్తారని లబ్ధిదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో సార్లు హామీలు ఇచ్చినా ఇవేమీ నెరవేరలేదు. లబ్ధిదారుల కలలు కలలుగానే మిగిలాయి. ప్రభుత్వం మారినంత మాత్రాన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పేద లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gudivada TIDCO Houses: లబ్ధిదారులకు అందని తాళాలు.. మందుబాబులకు ఆవాసాలుగా టిడ్కో ఇళ్లు

Last Updated : Nov 4, 2023, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.