TDP LEADER Bonda Uma fire on YCP GOVT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత గొడవల వల్లే విశాఖ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు అపహరణకు గురయ్యారని బొండా ఉమ ఆరోపించారు. అంతేకాకుండా, అధికార పార్టీ నేతలు విశాఖపై రాబందుల్లా వాలారని.. విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములను కొట్టేశారని, ప్రశాంతమైన విశాఖపట్నంలో అరాచకాలు చేస్తున్నారని బొండా ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వైసీపీ నేతలపై బొండా ఉమ ఆగ్రహం.. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్‌కు గురైన ఘటనపై బొండా ఉమామహేశ్వరరావు ఈరోజు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఎందుకు అపహరణకు గురయ్యారు..?, ఎందుకోసం వారిని కిడ్నాప్ చేశారు..?, ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వారెవరు..?, విశాఖలో వైసీపీ నేతలు ఏయే అరాచకాలు సృష్టిస్తున్నారు..? వంటి తదితర కీలక విషయాలను ఆయన వెల్లడించారు.
ఈ విభేదాల వల్లే ఎంపీ కుటుంబం అపహరణ గురైంది..?.. ''వైసీపీ నేతలు విశాఖపై రాబందుల్లా వాలారు. విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. ప్రశాంతమైన విశాఖలో అరాచకాలు చేస్తున్నారు. దసపల్లా, రామానాయుడు స్టూడియా, హయగ్రీవ భూములు కొట్టేశారు. విశాఖ ఎంపీ వన్ పర్సంట్‌కే డెవలప్‌మెంట్‌కు ఇస్తున్నారు. వైసీపీ నేతలు పెంచి పోషించిన పాములే వారిని కరుస్తున్నాయి. విశాఖను అఫ్గానిస్థాన్‌లా మార్చారు. విశాఖలో అపహరణలు, హత్యలు పెరిగాయి. నేరాల్లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది. జగన్.. మీ ప్రభుత్వంలో మీ పార్టీ నేతలకే రక్షణ లేదు. వైసీపీ నేతల అంతర్గత పోరు వల్లే విశాఖలో ఘటనలు. విశాఖలో కొట్టేసిన భూములపై ఉన్నతస్థాయి విచారణ చేయించగలరా..?. తమకు రక్షణ లేదని విశాఖ ప్రజలు ఇటీవల బ్యానర్లు కట్టారు. వైసీపీ నేతల అరాచకాల వల్ల విశాఖ ప్రజలకు రక్షణ లేదు. విశాఖలో అనేకమంది భూములు కబ్జాకు గురవుతున్నాయి. విశాఖలో అనేక ఘటనలు జరుగుతున్నా.. జగన్ ఎందుకు స్పందించరు..?. విశాఖలో వైసీపీ నేతల మధ్య అంతర్గత గొడవల వల్లే విశాఖ ఎంపీ కుటుంబం అపహరణ గురైంది. విజయ సాయిరెడ్డి, ఎంవీవీ మధ్య గొడవల్లో సుబ్బారెడ్డి చేరారు.'' అని బొండా ఉమ అన్నారు.
వారి అండలేకుండా ఎంపీ కుటుంబం కిడ్నాప్ సాధ్యమా..?.. అనంతరం ముగ్గురి మధ్య వివాదాలు రోజురోజుకు ముదిరాయని బొండా ఉమ వ్యాఖ్యానించారు. కొల్లగొట్టిన భూముల పంపకాల్లో జరిగిన ఆర్థిక వివాదాల వల్లే కిడ్నాప్ జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దల అండలేకుండా ఎంపీ కుటుంబం కిడ్నాప్ సాధ్యమా..? అంటూ బొండా ఉమ ప్రశ్నించారు. వాటాలు తేలక ఎంపీ భూబాగోతం విజయసాయి బయటపెట్టలేదా..? అని బొండా ఉమ గుర్తు చేశారు. అంతర్గత కుమ్ములాటలపై సరైన అధికారులతో సమగ్ర విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంపీ కుటుంబాన్ని కాపాడింది చంద్రబాబు ప్రవేశపెట్టిన సాంకేతికతే.విశాఖలో వైసీపీ నాయకులు పెంచి పోషించిన రౌడీమూకలే ఈరోజు వారిపై తిరిగి దాడులకు తెగబడుతున్నారు. పాలుపోసి పెంచిన పామే తిరిగి.. వారిని కాటేసింది. రౌడీషీటర్లను అడ్డుపెట్టుకుని విశాఖలో ఎంతో మందిని బెదిరించి వైసీపీ నేతలు విలువైన భూములను లాక్కున్నారు.-బొండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు