Chandrababu Naidu key comments on Viveka murder case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యలో జగన్ పాత్ర జగమెరిగిన సత్యమని వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎన్ని మలుపులైనా తిప్పుతారని ఆక్షేపించారు. అంతఃపుర కుట్ర బయటపడుతుందనే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనీయడంలేదని ఆరోపించారు. అందుకే ఇంత కాలం సీబీఐకి సహకరించకుండా పోలీసుల్ని అడ్డుపెట్టుకున్నారని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేందుకే మరో డేరా బాబా ఎపిసోడ్ తలపించారని దుయ్యబట్టారు. వివేకా హత్య గురించి ఉదయం 6గంటలకు ముందే జగన్‌కి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున.. ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు.
రేపే 'మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు'.. రెండు రోజులపాటు (ఈ నెల 27, 28) తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు' జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (26న) రాజమహేంద్రవరంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరై, పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
TDP Mahanadu: ఎన్టీఆర్ శతజయంతి వేళ.. చరిత్రలో నిలిచిపోయేలా మహానాడుకు ఏర్పాట్లు
పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి వెళ్లాలని తెదేపా పొలిట్ బ్యూరో నిర్ణయించిందని టీడీపీ పొలిట్‌బ్యూరో అనంతరం నేతలు స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయమై ఇవాళ హైకోర్టులో జరిగిన వాదనలు వింటే జగన్ పాత్ర తేటతెల్లం చేస్తోందని పొలిట్ బ్యూరో అభిప్రాయపడిందన్నారు. వైఎస్ వివేకా మరణం జగనుకు ముందే తెలిసునని.. అజయ్ కల్లం వంటి వారు కూడా వెల్లడించారన్నారు. ఇప్పటివరకు వేళ్లన్నీ అవినాష్ రెడ్డి వైపు చూపితే.., ఇప్పుడు జగనుపై అనుమానాలు వస్తున్నాయన్నారు. జగన్ దోషిగా నిలబడాల్సి వస్తోందని నేతలు స్పష్టం చేశారు. దర్యాప్తు జరుగుతోన్న తీరు చూస్తే.. జగన్‌పై అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. తమ పొలిటికల్ లైన్ ఏంటో రాజకీయ తీర్మానంలో వెల్లడిస్తామని నేతలు వెల్లడించారు.
ఈ మహానాడులో జాతీయ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నామని... అశోక్ గజపతి రాజు నేతృత్వంలో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా చేసే ప్రసంగాల్లో యువతకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. యువతను జగన్ ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో మహానాడు ద్వారా వివరిస్తామన్నారు. యువత, మహిళ, రైతులకు తెదేపా అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆ విషయాన్ని ప్రతిబింబించేలా మహానాడు నిర్వహణ చేస్తున్నామన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమం ఎత్తేస్తారనే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా మా విధానాన్ని వివరిస్తామన్నారు. మహానాడును అడ్డుకునేందుకు వైకాపా దుష్టశక్తిలా వ్యవహరిస్తోందని నేతలు ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సమస్యలను మహానాడు వేదికగా చర్చిస్తామని నేతలు పేర్కొన్నారు. దేశంలో సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని నేతలు వెల్లడించారు. ఎన్టీఆర్ కు భారత రత్నపై కేంద్రాన్ని పట్టు బట్టాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు.
వివేకా మృతి విషయం జగన్‌కు ముందే తెలుసు.. అవినాష్ రెడ్డే చెప్పారా..?: సీబీఐ
వివేక హత్య కేసులో జగన్ పాత్ర జగమెరిగిన సత్యం.. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ''రేపటి నుంచి రెండు రోజులపాటు మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను అట్టహాసంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్ మోహన్ రెడ్డి పాత్ర జగమెరిగిన సత్యం. హత్య కేసుని ఎన్ని మలుపులైనా తిప్పుతారు. నేటి సీబీఐ ప్రస్తావనతో జగన్ పాత్ర బహిర్గతమైంది. వివేకా హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డి పేరు సీబీఐ ప్రస్తావించటంపై పొలిట్ బ్యూరోలో సుదీర్ఘ చర్చించాం. కుట్ర బయటపడుతుందనే ఇంతకాలం అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా చూసుకున్నారు. అందుకే ఇంత కాలం సీబీఐకి సహకరించకుండా పోలీసుల్ని అడ్డుపెట్టుకున్నారు. అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండేందుకే మరో డేరా బాబా ఎపిసోడ్ తలపించారు. వివేకా హత్య గురించి ఉదయం 6 గంటలకు ముందే జగన్ మోహన్ రెడ్డికి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డే.'' అని ఆయన అన్నారు.
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. రేపు సీబీఐ వాదనలు