Telangana Govt Fill Vacancies in Medical Department: నూతన సంవత్సరం వేళ రాష్ట్రంలో కొత్తగా నియమితులైన వైద్యులు విధుల్లో చేరారు. ఒకేసారి 929 మంది వైద్యులు విధుల్లో చేరారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పాకళా వేదికగా వీరికి తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలు అందజేశారు. సీఎం ప్రకటించిన 81 వేల ఉద్యోగాల్లో తొలుత పోస్టింగ్‌లు పొందింది వైద్యులేనని హరీశ్ వ్యాఖ్యానించారు.
వైద్యారోగ్యశాఖలో 21, 202 ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. బాగా పనిచేసి మంచి ఫలితాలు సాధించే వైద్యులకు బదిలీల్లో ప్రాధాన్యమిస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. ఎమ్‌బీబీఎస్ కోర్సు అనంతరం ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తూ కౌన్సెలింగ్ ద్వారా కొత్తగా వైద్యులుగా నియమితులైన వారు నిరుపేదలకు వైద్యం అందిస్తామన్నారు. తక్షణమే పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాల్లో చేరితే నూతన సంవత్సరాన చేరిన జ్ఞాపకం మిగులుతుందని హరీశ్‌రావు సూచించారు.
గ్రామీణ, పట్టణ పేదలకు నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు అందించే సదావకాశం రావడం అద్భుతమని యువ వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లోపే అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడంపై యువ వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం వల్ల పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. పైరవీలకు తావులేకుండా ప్రతిభ ఆధారంగా 929 పోస్టులను భర్తీ చేయడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైద్యారోగ్యశాఖలో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది.
ఇవీ చదవండి: