Teachers strike for Old Pension Scheme: జీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపునివ్వటంతో పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ముట్టడికి యత్నించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని స్టేషన్లకు తరలించారు. తమకు గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విధంగానే ఓపీఎస్ అమలు చేయాలంటూ ఉద్యోగులు నిధాలు చేశారు. లేకుంటే తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయలు ఫ్యాప్టో(Fapto) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ (Collectorate) ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి చిలకలపూడి స్టేషన్‌కు తరలించారు. గుంటూరులో కలెక్టరేట్ ముట్టడించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. భారీ ఫ్లకార్డుల ప్రదర్శనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విజయనగరం జిల్లా: సీపీఎస్, జీపీఎస్ వద్దు, ఓపీఎస్ (OPS) ముద్దు అంటూ ఉపాధ్యాయులు ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా, విజయనగరం జిల్లాలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ కు ర్యాలీగా చేరుకుని, ధర్నా నిర్వహించారు. ఓపీఎస్ అమల్లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నినదించారు. "హామీ ఇచ్చింది ఓపీఎస్, మమ్మల్ని ముంచే జీపీఎస్ వద్దే వద్దంటూ పేర్కొన్నారు.
Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: జీపీఎస్‌లో పెన్షన్‌కు గ్యారంటీ లేనట్టేనా ?
మ్యానిపెస్టో (Manifesto) బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న సీఎం, మ్యానిపెస్టోలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఓపీఎస్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి., పదవిలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు., మడ తిప్పారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఓపీఎస్ అమలు చేయకపోగా., జీపీఎస్ (GPS) పేరుతో తమను వెన్నుపోటు పోడిచే ప్రయత్నిం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం హామీ మేరకు, ఓపీఎస్ ను అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేసారు.
Bandi Srinivasa Rao about OPS: ఓపీఎస్ ఇచ్చేవరకూ పోరాడుతూనే ఉంటాం: బండి శ్రీనివాసరావు
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో జీపీఎస్ ను వ్యతిరేకిస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు (Teachers) భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో సీఎం ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. జీపీఎస్‌ను ఎట్టి పరిస్థితులను అంగీకరించబోమని, ఓపీయస్ సాధించుకునేంతవరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.