TDP Spokes Person GV Reddy : వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులు సొంత కుటుంబ సభ్యులేనని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆరోపించారు. నవీన్, కృష్ణమోహన్‌రెడ్డిల ఫోన్ డేటాలో తప్పేముందని సజ్జల మాట్లాడటమేంటని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణ ముగించుకుని వచ్చిన తర్వాత నవీన్, కృష్ణమోహన్‌రెడ్డిలను సీఎస్ తన కారులో ఎక్కించుకుని వెళ్లడమేంటని మండిపడ్డారు. సీబీఐ అధికారులు రాష్ట్రానికి వస్తే సీఎం హడావుడిగా దిల్లీ ఎందుకు వెళ్లారని జీవీ రెడ్డి నిలదీశారు.
" అవినాష్ రెడ్డిని విచారించినప్పుడు నవీన్, కృష్ణమోహన్ రెడ్డిల పేర్లు బయటకు వచ్చాయి. వీరు జగన్మోహన్ రెడ్డికి, భారతికి.. హత్య జరిగిన రోజు మరుసటి రోజు ఫోన్లు చేశారని ఆధారాలు లభించాయి. దీనిపై సజ్జల స్పందిస్తూ దీనిలో తప్పేముంది అంటున్నారు. సజ్జల ఏది చెప్పిన తప్పేముంది అంటారు. నవీన్, కృష్ణమోహన్‌రెడ్డిలను సీబీఐ విచారణ అనంతరం బయటకు రాగానే సీఎస్ వాళ్లని కారులో తీసుకెళ్లారు. అసలు ఆ సమయంలో సీఎస్‌కు అక్కడ ఏం పని"-జీవీ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి
ఇవీ చదవండి :