NARA LOKESH: అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా టమాటా రైతుల పరిస్థితి ఉండగా.. అన్నదాతలను ఆదుకుంటానని మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి ఏ పరదాల మాటున దాక్కున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. మార్కెట్లో టమాటా కిలో 20 రూపాయలకు పైన అమ్ముతూ.. రైతు దగ్గర కిలో ఒక రూపాయికే కొంటుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. అన్నింటికీ జిందా తిలిస్మాత్‌లా పని చేస్తాయని చెప్పిన జగన్ నాటక రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయనని అన్నారు.
విత్తనాల నుంచి విక్రయం వరకూ అన్నదాతకు అన్యాయం చేయడమేనా మీరు తీసుకొచ్చిన రైతు రాజ్యమా అని ధ్వజమెత్తారు. వైకాపా పెట్టిన రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎలుకలు కొట్టేశాయా లేక ఉడతలు ఊదేశాయా అని లోకేశ్ ఎద్దేవాచేశారు. టమాటా రైతులకు మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచడానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్ స్టోరేజ్‌లు ఏవని అడిగారు. టమాటా ఎక్కువగా పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా టమాటా పేస్ట్, సాస్, కెచప్ తయారీ అంటూ ఊరించినవి ఉత్తుత్తి కోతలేనా అని ఆక్షేపించారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి టమాటా రైతులకు ఇచ్చిన హామీ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌కు జత చేశారు.
-
జవాబు చెప్పండి జగన్ గారూ.. టమోటా అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా ఉంటే.. అన్నదాతలని ఆదుకుంటానంటూ మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి ఏ పరదాల మాటున దాక్కున్నారు? మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే..,(1/3) pic.twitter.com/QpPXDKErgR
— Lokesh Nara (@naralokesh) November 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">జవాబు చెప్పండి జగన్ గారూ.. టమోటా అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా ఉంటే.. అన్నదాతలని ఆదుకుంటానంటూ మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి ఏ పరదాల మాటున దాక్కున్నారు? మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే..,(1/3) pic.twitter.com/QpPXDKErgR
— Lokesh Nara (@naralokesh) November 16, 2022జవాబు చెప్పండి జగన్ గారూ.. టమోటా అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా ఉంటే.. అన్నదాతలని ఆదుకుంటానంటూ మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి ఏ పరదాల మాటున దాక్కున్నారు? మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే..,(1/3) pic.twitter.com/QpPXDKErgR
— Lokesh Nara (@naralokesh) November 16, 2022
-
టమోటా రైతులకి మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచడానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్ స్టోరేజిలు ఏవీ? టమోటా ఎక్కువగా పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా టమోటా పేస్ట్, సాస్, కెచప్ తయారీ అంటూ ఊరించినవి ఉత్తుత్తి కోతలేనా?(3/3)#JaganFailedCM #JaganPaniAyipoyindhi
— Lokesh Nara (@naralokesh) November 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">టమోటా రైతులకి మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచడానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్ స్టోరేజిలు ఏవీ? టమోటా ఎక్కువగా పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా టమోటా పేస్ట్, సాస్, కెచప్ తయారీ అంటూ ఊరించినవి ఉత్తుత్తి కోతలేనా?(3/3)#JaganFailedCM #JaganPaniAyipoyindhi
— Lokesh Nara (@naralokesh) November 16, 2022టమోటా రైతులకి మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచడానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్ స్టోరేజిలు ఏవీ? టమోటా ఎక్కువగా పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా టమోటా పేస్ట్, సాస్, కెచప్ తయారీ అంటూ ఊరించినవి ఉత్తుత్తి కోతలేనా?(3/3)#JaganFailedCM #JaganPaniAyipoyindhi
— Lokesh Nara (@naralokesh) November 16, 2022
ఇవీ చదవండి: