ETV Bharat / state

" ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు..! లోకేశ్​కు ప్రాణ హాని ఉంది..!"

TDP : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర భద్రత లోపాలపై.. టీడీపీ నేతలు గవర్నర్​ను కలిశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన నేతలు పోలీసులు సృష్టిస్తున్న అడ్డంకులను, వైసీపీ నాయకుల తీరును గవర్నర్​కు వివరించారు.

TDP
గవర్నర్​ను కలిసిన టీడీపీ నేతలు
author img

By

Published : Feb 11, 2023, 3:10 PM IST

TDP Politburo Members : లోకేశ్​ యువగళం పాదయాత్రలో ప్రాణహాని తలపెట్టే కుట్రలను వైసీపీ పన్నుతోందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదుచేశారు. కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, వర్ల రామయ్యలు రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిశారు. నిఘా ముసుగులో పోలీసులు డ్రోన్ల ద్వారా లోకేష్ లేని చోట చిత్రీకరిస్తున్న దృశ్యాలను గవర్నర్​కు అందించారు. నారాలోకేష్ పాదయాత్రకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గవర్నర్​కు విన్నవించారు.

ఈ సమస్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు అవకాశం రానందున.. డీజీపీని కలిసే అవకాశం కల్పించమని గవర్నర్​ను కోరారు. పోలీసులు అడుగడుగునా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించటం, ప్రజలతో మాట్లాడకుండా మైక్ నియంత్రించడం, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 20సార్లు ఫిర్యాదు చేశామని.. న్యాయం జరగలేదని గవర్నర్​కు వివరించారు. లోకేశ్​కు ప్రాణహాని ఉందని గవర్నర్​కు తెలిపారు. సజ్జల రామకృష్ణరెడ్డి కుమారుని ఆధ్వర్యంలో వైసీపీ సోషల్​ మీడియా పనిచేస్తోందని.. పోలీసులే డ్రోన్ల ద్వారా చిత్రికరించిన దృశ్యాలను అతనికి పంపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి ద్వారా భద్రతలోపాలు ఉన్న ప్రదేశాలను తెలుసుకుని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.

ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లడుతూ.. వైసీపీ పోలీసుల గుండాలతో యువగళం పాదయాత్రని అణగదొక్కే తీరును గవర్నర్​కు సమగ్రంగా నివేదించామన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు డీఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ నియమించిందని, ఆయన అక్రమాల చిట్టా అంతా తమ వద్ద ఉందని అన్నారు. త్వరలోనే దానిని బయటపెడతామన్నారు. తాడేపల్లి పెద్దలు చెప్పినంత మాత్రన పోలీసులకు మాపై చేయి చేసుకునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. తమ సహనాన్ని పోలీసుల పరీక్షించవద్దని అన్నారు. పోలీసుల దుశ్చర్యాల గురించి గవర్నర్​కు పూర్తిగా వివరించామని అన్నారు.

"లోకేశ్​ చేపట్టిన పాదయాత్రలో స్వయంగా తాడేపల్లి నిబంధనలు పాటిస్తూ.. డీఐజీ కొల్లు రఘురామరెడ్డి వెనకాల కారులో ఉండి, అక్కడ ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మరి ఇతను ఏవిదంగా ప్రవర్తిస్తున్నారనేది ఆయనే ఆలోచించుకోవాలి." -బోండా ఉమా, టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యులు

"యువతలో చైతన్య వచ్చిందని పాదయాత్రను ఏదో విధంగా పోలీసులు అడ్డుకునేందుకు కుట్ర జరుపుతున్నారు. వారు పాదయాత్రను అడ్డుకునేందుకు చేయని కుట్ర లేదు. ఇందులో ప్రధానంగా లోకేశ్​ భద్రతకు ప్రమాదం ఉందని భావిస్తున్నాము. ఎక్కడ అడ్డుకోవచ్చు, ఎక్కడ ఏం అల్లరి సృష్టించాటానికి అస్కారం ఉందనే అలోచనలన్ని ప్రభుత్వ అధ్వర్యంలో కుట్ర జరుగుతోంది." -నక్క అనంద్​బాబు, మాజీ మంత్రి

గవర్నర్​ను కలిసిన టీడీపీ నేతలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.