ETV Bharat / state

TDP Leader Yarapatineni on Jagan జగన్ నేర స్వభావంతో అధికారులకు ఇబ్బందులు.. వచ్చే ఎన్నికల్లో రాముడుకి రావణాసురుడికి మధ్య పోటీ: యరపతినేని - Sand mining in AP

TDP Leader Yarapatineni Srinivasa Rao Comments on Jagan: రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే రావణ కాష్ఠంలా, తాలిబన్ల పాలనను తలపిస్తున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన యరపతినేని ముఖ్యమంత్రి జగన్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

yarapatineni_srinivasa_rao
yarapatineni_srinivasa_rao
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 1:36 PM IST

TDP Leader Yarapatineni Srinivasa Rao Comments on Jagan: రాబోయే ఎన్నికల్లో రాముడు వంటి చంద్రబాబుకు రావణాసురుడి వంటి జగన్​కు మధ్య పోటీ జరుగుతోందని.. అంతిమ విజయం తెలుగుదేశం పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన యరపతినేని ముఖ్యమంత్రి జగన్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే రావణ కాష్ఠంలా, తాలిబన్ల పాలనను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని విమర్శించారు.

Skill Development Program vs Smart Meters Project: స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఐతే.. స్మార్ట్ మీటర్లతో ప్రజాధనం దుర్వినియోగం కాదా..?

రాష్ట్రంలో వేల కోట్ల ఖనిజ సంపదను తవ్వి విదేశాలకు తరలించారని.. నౌకాశ్రయాలను నచ్చిన వారికి కట్టబెట్టారని, ఇసుక తవ్వకాలు(Sand mining in AP) గంపగుత్తగా వారి మనుషులకు ఇచ్చారుృని, మద్యం అమ్మకాల్లో ఏటా 12 వందల కోట్లు జగన్​కు వస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. నైపుణ్యాభివృద్ధికి రూ. 300 కోట్లు ఖర్చు చేస్తే అవి వృథా అన్నవారు.. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి 3 వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం తెచ్చే అప్పులకు, కాంట్రాక్టర్లకు చెల్లించే డబ్బులకు లెక్క లేదని.. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సాఫ్ట్ వేర్ మార్చారని ఆరోపించారు.

YCP Leaders Attacked on TDP Leaders: రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. మహిళ అని చూడకుండా..

ప్రశాంత్ కిషోర్ టీంకు రూ 300 కోట్లు ప్రజాధనం దోచిపెట్టారని, సాక్షి దినపత్రికకు 300 కోట్లకు పైగా ప్రకటనలు ఇచ్చారని విమర్శించారు. జగన్ నేర స్వభావం వల్ల రాబోయే రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్ఛరించారు. వైసీపీ పెద్దలు చెప్పే అడ్డమైన పనులు చేసి పోలీసు అధికారులు ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. రోజాను తిట్టారని బండారు సత్యనారాయణమూర్తిని(Bandaru Satyanarayanamurthy comments on Roja) అరెస్టు చేశారని.. మరి వైసీపీ నాయకుల భాష ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. అలాంటి రోజా ఎన్నో సార్లు టీడీపీ నేతలపై ఎన్నో రకాల అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలుగుదేశం నాయకులపై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, వారు మాట్లాడిన మాటలు పోలీసులకు కనిపించ లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Irregularities in Voter List దుకాణానికి ఇంటి నంబర్.. 100కి పైగా ఓట్లు! నంబరే లేని ఇంట్లో ఏకంగా 280..

మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు అరాచకాలు చేస్తుంటే అక్కడి పోలీసులు భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గొట్టిపాళ్లలో వైసీపీ నేతలు టీడీపీ వారిని కొట్టడం కాకుండా మా వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారని.. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి పేరుని కేసులో చేర్చారని విమర్శించారు. మాచర్లలో పోలీసులు చేసే అరాచకాలు పల్నాడు ఎస్పీకి కన్పించటం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో వైసీపీ వాళ్లనైనా క్షమిస్తాం కాని.. తప్పుడు కేసులు పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారుల్ని వదిలేది లేదని హెచ్ఛరించారు.

TDP Leader Yarapatineni on Jagan జగన్ నేర స్వభావంతో అధికారులకు ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.