TDP leader Pilli Manikya Rao Comments on Illegal Sand Mining: ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఇసుక దోపిడీని సమర్థిస్తూ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ న్యాయస్థానాల్లో పచ్చి అబద్ధాలు చెప్పారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. మార్చి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరగడం లేదని ఏజీ చెప్పడం ముమ్మాటికీ జగన్ రెడ్డి దోపిడీకి కొమ్ముకాయడమేనని మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ పలుమార్లు హెచ్చరించిందని మాణిక్యరావు పేర్కొన్నారు. అయినా మంత్రి పెద్దిరెడ్డి తన ఇసుకమాఫియా కొనసాగిస్తూనే ఉన్నాడని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పనిచేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయకుండా పోతున్నాయని పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. సహజ వనరులను జగన్ తన అనునాయులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, జగన్‌కు చెందిన దొంగల ముఠా మట్టి, ఇసుకను దోచుకుతింటుందని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 500 ఇసుక రీచుల ద్వారా విచ్చలవిడిగా దోపిడి చేస్తున్నారని తెలిపారు. మే నెలలో జేపీ వెంచర్స్ టెండర్ కాలం ముగిసిన తరువాత కూడా, అదే జేపీ వెంచర్స్ పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని మాణిక్యరావు ఆరోపించారు. మళ్లీ తప్పుడు పద్దతిలో టెండర్స్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలపై టీడీపీ పోరాటాలు చేయడం వల్లే ఎన్జీటీ అనేక కేసులు పెట్టిందని పేర్కొన్నారు. జేపీ వెంచర్స్‌తో రాష్ట్రానికి ఎంత ఆర్థిక ప్రయోజనం కలిగిందో, వైసీపీ ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. జేపీ వెంచర్స్ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు రాలేదని, జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా కోసం చేసిన డబ్బులు తమకే రావాలంటూ జేపీ వెంచర్స్ ఆరోపిస్తుందని మాణిక్యరావు తెలిపారు.
ఉచిత ఇసుక పాలసీ కేసు - చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిసెంబరు 6కు వాయిదా
ఓవైపు సహజవనరుల దోపిడిపై ఎన్జీటీ విచారణ జురగుతుంటే, మరో వైపు వైసీపీ నేతలు విచ్చలవిడిగా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలపై ప్రభుత్వం కోర్టుల్లో సైతం అబద్దాలు ఆడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు అధికారులు వంతపాడుతున్నారన్నారు. ఇన్ ల్యాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ ఇవ్వకుండానే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మాణిక్యరావు పేర్కొన్నారు. ఏజీ శ్రీరామ్ కోర్టులో అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలతో నది ప్రవాహం తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొని పంటపోలాల మీదకు వస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇసుక దోపిడిపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. వైసీపీ అక్రమంగా తిన్నమెుత్తాన్ని కక్కిస్తామని వెల్లడించారు. ఇప్పటికే కోర్టు విచారణ కమిటీ వేసిందని, ఇసుక అక్రమాలకు సంబందించి విచారణ జరుగుతున్నా, ప్రభుత్వం ఇసుక అక్రమాలను ఆపడం లేదని ఆరోపించారు. త్వరలోని వైసీపీ ప్రభుత్వం తగిన ముూల్యం చెల్లించక తప్పదని పిల్లి మాణిక్యరావు హెచ్చరించారు.
కాలపరిమితి పూర్తైన బిల్లులతో అక్రమంగా ఇసుక తరలింపు-మాజీ ఎమ్మెల్యే