TDP 41st Foundation Day Celebrations : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకంగా ఏర్పడిన పసుపు జెండా రాష్ట్రంలో రెపరెపలాడింది. రాజకీయ చైతన్యానికి సంకేతంగా పార్టీ స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం శ్రేణులు పాలాభిషేకాలు నిర్వహించారు. పలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించి, కేక్ కట్ చేసిన శ్రేణులు భారీగా సంబరాలు జరుపుకున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ నేతలు ర్యాలీగా వెళ్లి.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగుదేశం నేతలు ఆవిష్కరించారు. తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి, టెక్కలిలోని పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి నేతలు నివాళులు అర్పించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సంజామల మోటు నుంచి గాంధీ కూడలి వరకు టీడీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. కడప నగరంలో టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 41 కిలోల కేక్ కట్ చేసి.. ఘనంగా వేడుకులు చేసుకున్నారు.
గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం, మంగళగిరిలో.. ఆ పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ వేడుకులు ఘనంగా జరిగాయి. అనంతరం గొల్లపూడి వన్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగుదేశం నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కర్నూలులో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. మంత్రాలయంలో తెలుగుదేశం నేత తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గం మామిదాలపాడులో టీడీపీ నేతలు జెండాను ఆవిష్కరించారు. ఆదోనిలోని టీడీపీ కార్యాలయం నుంచి భీమస్ కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఘనంగా పసుపు వేడుకలు జరుపుకున్నారు.
ఇవీ చదవండి :