SUPREME COURT AMARAVATI CASES: ఆంధ్రప్రదేశ్ విభజన, అమరావతి కేసులను ఒకే ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్ నవంబర్ 1న జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు అమలు చేసింది. వాస్తవానికి అమరావతి కేసును ఈ నెల 14వ తేదీకి లిస్ట్ చేసినట్టు గురువారం సాయంత్రం వరకు కంప్యూటర్ జనరేటెడ్‌లో చూపించింది. తరువాత అది నాలుగవ తేదీకి మారింది. గురువారం రాత్రి విడుదలైన శుక్రవారం నాటి సప్లమెంటరీ క్లాజ్ లిస్ట్‌లో ఈ కేసులను నవంబర్ 5, ఐటం నంబర్ 47 కింద లిస్టు చేశారు. ఈమేరకు 2014లో దాఖలైన రిట్ పిటిషన్‌తోపాటు, అమరావతి రాజధాని కేసులు జస్టిస్ జోసేఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: