Government Polytechnic College : విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాలకు చెందిన వేలాది మంది విద్యనభ్యసించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల.. ప్రస్తుతం పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. పరిపాలనా భవనం వర్షానికి కారడం ఒక సమస్యయితే.. కళాశాల్లో విద్యనభ్యసిస్తున్న మహిళా విద్యార్థులకు వసతిగృహం లేకపోవడం మరొక సమస్య. సుమారు 750 మంది విద్యార్థినిలు కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వారిలో దాదాపు 250మందికి వసతిగృహం అవసరముంది. ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు.. వసతిగృహం సౌకర్యం లేకపోవడంతో బయట రూములు, ప్రైవేట్ హాస్టళ్లకి వేళాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కొరతతో నిలిచిపోయిన వసతీగృహం పనులు: గతంలో ఉన్న హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. నూతన వసతీగృహం చాలా వరకు పూర్తయినా నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. దీంతో కళాశాల్లో చదువుతున్న పేద విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల లోపలకు వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. వర్షం కురిస్తే చాలా వరకు రోడ్డు బురదగా మారుతుందని విద్యార్థులు వాపోతున్నారు.
ఈ కళాశాలలో వసతిగృహం లేనందున చాలా మంది విద్యార్థినులు పాలిటెక్నిక్ కాలేజిలో చేరినా, పరిస్థితుల ప్రభావంతో మానేశారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. గతంలో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లు సకాలంలో మంజూరు చేయకపోవడంతో కాట్రాక్టర్ హస్టల్ నిర్మాణ పనుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. తమ కళాశాలలో చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్న కొంత మంది పూర్వ విద్యార్థులు కళాశాలోని పరిశోధన కేంద్రానికి అవసరమైన పరికరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. వాటిని పెట్టడానికి స్థలంలేక తీసుకోలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. పాత భవనం వర్షానికి కారుతుండడంతో మరమ్మతు పనులు చెపడుతున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ పరిపాలన భవనం నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
"ఈ కళాశాలకు భవనాల అవసరం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 700 మంది అమ్మాయిలు ఉన్నా.. వసతి గృహాలు లేకపోవండంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి త్వరగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. భవనాలు ఉంటే ఎన్నారైలు ల్యాబ్‌కు సంబంధించిన పరికరాలు ఇచ్చెందుకు సిద్ధంగా ఉన్నారు.''- పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు
గొప్ప చరిత్ర కలిగిన తమ కళాశాలకు నిధులు మంజూరు చేసి పరిపాలన భవనం, విద్యార్థినులకు వసతిగృహ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ కళాశాలకు జాతీయ రహదారి వైపు ముఖ్య ద్వారం నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవిండి: