Statewide Anganwadi Workers Strike : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామే తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని అంగన్వాడీలు అన్నారు. 38వ రోజు కూడా ఆందోళనలు కొనసాగించారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట జగన్ మాస్క్ ధరించి మహిళలపై చెయ్యి పెట్టి భస్మాసురుడు అంటూ నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడంతో ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు ప్రజామద్దతు కూడగడుతూ నెల్లూరు వీఆర్సీ కూడలి వద్ద అంగన్వాడీలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వ తాటకు చప్పుళ్లకు వెనక్కి తగ్గేదే లేదు : అంగన్వాడీలు
Anganwadi Workers Strike in Ambedkar District : వేతనాలు పెంచాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మద్దతు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరితే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడం దారుణమని మండిపడ్డారు. అంబేడ్కర్ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లకు జీతాలు పెంచి స్కూళ్లు తెరిపించాలని చిన్నారులు ధర్నాలో పాల్గొన్నారు. వారికి తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని విజయనగరం కలెక్టరేట్ నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టు వరకు ర్యాలీ చేస్తున్న అంగన్వాడీలకు సీపీఎం నేతలు మద్దతు ప్రకటించారు. శ్రీకాకుళం టెక్కలిలో ఎస్మా నోటీసులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టు వరకు ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని అంగన్వాడీలు తేల్చిచెప్పారు.
ప్రభుత్వ మొండి వ్యవహార శైలిని నిరసిస్తూ కార్మిక సంఘాల జైల్భరో
Vizianagaram : ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులను నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అధికారులకు వినతిపత్రం అందించి నిరసన చేపట్టారు. అంగన్వాడీలకు సీపీఎం ప్రజాసంఘాల నాయకులు మద్ధతు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ చొరవ తీసుకుని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమతో చర్చలైతే జరుపుతుందని కానీ ప్రధాన డిమాండ్లకు పరిష్కారం చూపించడం లేదని అంగన్వాడీల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పైడ్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పెరవలిలో అంగన్వాడీలు మండల కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు తెదేపా మాజీ ఎమ్మెల్యే అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. న్యాయబద్ధమైన డిమాండ్లతో అంగన్వాడీలు 38 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీలతో పాటు ఉద్యోగులందరు కలిసి ఎస్మా ప్రయోగించి బంగాళాఖాతంలో కలపడం ఖాయమని జగన్‌ని హెచ్చరించారు.
'పండుగ వేళ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది' - 36 రోజులుగా అంగన్వాడీల సమ్మె
Guntur : అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలంటూ చేపట్టిన సమ్మె 38వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సమ్మె కొనసాగించారు. జగన్ తమ సమస్యలను పరిష్కరిస్తాడని గెలిపించుకుంటే తమ బాధల్ని పట్టించుకోకుండా రోడ్డున పడేశారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగిన జగన్ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న చర్చలకు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి పంపడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ నెల19వ తేదీన ప్రాజెక్టు కార్యాలయాలకు ప్రదర్శనగా వెళ్లి షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వనున్నట్లు అంగన్వాడీలు తెలిపారు.