ETV Bharat / state

State Revenue Deficit Problem in AP: భయపెడుతున్న రెవెన్యూ లోటు పెరుగుదల.. ప్రభుత్వం వద్ద కేవలం రూ.11.62 కోట్ల నగదు - ap latest news

State Revenue Deficit Problem in AP: ఏపీలో రెవెన్యూ లోటు రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. మొదటి ఆరు నెలలకే రెవెన్యూ లోటు అంచనాలను దాటిపోవటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం రెవెన్యూ లోటు 119 శాతానికి చేరుకున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు మాసంతో ముగిసిన కాలానికి గానూ రెవెన్యూ లోటు రూ.37,326 కోట్లుగా లెక్కతేలింది. ఇక మరో 5 నెలల కాలానికి ఈలోటు భారీగా పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నానాటికి పెరుగుతున్న రెవెన్యూ లోటు, ఆర్ధిక స్థిరత్వంపై స్పష్టమైన నిర్ణయాలు లేకపోవటం రాష్ట్ర ఆర్ధిక నిర్వహణపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

State Revenue Deficit Problem in AP
State Revenue Deficit Problem in AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 2:51 PM IST

Updated : Oct 17, 2023, 7:21 PM IST

State Revenue Deficit Problem in AP : ఆంధ్రప్రదేశ్​లో రెవెన్యూ ఖర్చులు, అప్పులూ పెరిగి పోయి రెవెన్యూ లోటుకు దారి తీస్తున్నాయి. ఏడాది కాలంలో నమోదు కావాల్సిన రెవెన్యూ లోటు మొత్తం 5 నెలల్లోనే నమోదై పోయింది. ప్రస్తుతం ఏపీ ఆర్ధిక నిర్వహణపై సర్వత్రా సందేహాలు వ్యక్తం (Doubts are Widespread on APs Financial Management) అవుతున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఆగస్టు 31 నాటికి 37,326 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు నమోదైంది. బడ్టెట్ అంచనాలతో పోలిస్తే 119శాతం మేర అదనంగా లోటు మొదటి 5 నెలల కాలానికే నమోదైపోయింది. వాస్తవానికి ఏడాది మొత్తానికి బడ్జెట్ లో రూ. 22,316 కోట్ల మేర రెవెన్యూ లోటు నమోదు కావొచ్చని అంచనా వేశారు.

Worried About State Financial Condition : రెవెన్యూ లోటు సున్నాగా తీసుకు రావటమే ఆర్ధిక శాఖ ప్రధాన లక్ష్యం. అయితే సంక్షేమ పథకాలు, అప్పులపై భారీస్థాయిలో వడ్డీ తదితర అంశాల ఆధారంగా రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. 2023 ఆగస్టు మాసాంతానికి నమోదైన రెవెన్యూ లోటు రూ. 37,326 కోట్లుగా తేలింది. దీంతో అంచనాల కన్నా 119 శాతం మేర రెవెన్యూలోటు పెరిగిపోయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మొదటి 5 నెలలకే రెవెన్యూ లోటు ఈ స్థాయిలో పెరిగిపోవటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

AP Debts Crossing Limits అప్పు ఆదాయంగా మారడంలేదు.. అప్పుగానే మిగిలిపోతోంది! ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం.. అయినా తగ్గేదేలే అంటున్న సర్కార్!

Public Concerns Over Increase in Revenue Deficit : రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంతో పాటు వివిధ రూపాల్లో తీసుకువస్తున్న అప్పులన్నీ ఖర్చులకే సరి పెడుతోంది. మొదటి 5 నెలల కాలానికే ఏపీ రెవెన్యూ లోటు ఏడాదితో సరిసమానంగా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. రెవెన్యూ రాబడితో పాటు ఇతర ఆదాయ మార్గాల్లో పెరుగుదల నమోదు కాకపోవటం, రెవెన్యూ వసూళ్లలో తగ్గుదల వెరసి భారీ స్థాయిలో రెవెన్యూ లోటు పేరుకుపోతోంది. ఎఫ్ఆర్ బీఎం పరిమితులను సైతం దాటేసి రుణాలు చేస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకే అధిక మొత్తం వ్యయం చేస్తోంది.

AP Government Trying to Get more Debts రూ. 5వేల కోట్ల అప్పు ఇప్పించండి సార్! తాజా రుణం కోసం జగన్ సర్కార్..

Increasing Revenue Deficit in AP : వడ్డీల చెల్లింపుల కోసం ఇప్పటికే 10,817 కోట్లు, వేతనాల కోసం 21,818 కోట్లు, పెన్షన్ కోసం రూ.8686 కోట్ల రూపాయల మేర వ్యయం చేశారు. అలాగే సబ్సిడీ కోసం 12,192 కోట్లు వెచ్చించారు. అత్యధికంగా సామాజిక ఉచిత పథకాల కు ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం 68,012 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆగస్టు 31 నాటికి ప్రభుత్వం 35,593 కోట్ల రూపాయల అప్పు తీసుకువచ్చింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు కేవలం 11.62 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

భయపెడుతున్న రెవెన్యూ లోటు.. ప్రతిసారీ అంచనాలకు మించే ఖర్చులు.. దీనికి పరిష్కారం ఏంటి..?

Last Updated : Oct 17, 2023, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.