State Government Diverted Panchayat Funds In AP : పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంటోందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ కుమార్ రాష్ట్రంలో ఇటీవల పర్యటించారు.
Central Government Seeks Clarification on Diversion of Finance Commission Funds : గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధుల నుంచి అధిక మొత్తాలను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించటంపై విజయ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిపాలన ఖర్చులకు నిర్దేశించిన 10 శాతంలోనే విద్యుత్తు బకాయిలకు చెల్లించాలన్న మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని వివరణ కోరడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించిన విషయాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
పంచాయతీ ఖాతాలు ఖాళీ.. ఏకగ్రీవ నిధులూ విద్యుత్తు ఛార్జీలకే!
ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో పంచాయతీలు నాలుగేళ్లుగా తీవ్రంగా నష్టపోయాయి. కేంద్రం ఆదేశాలను సరిగా అమలు చేయని కారణంగా నిధులు సకాలంలో రావటం లేదు. వచ్చే కొద్దిపాటి నిధులను కూడా విద్యుత్తు ఛార్జీల (Electricity Charges in AP) బకాయిలకు మళ్లించటంతో పంచాయతీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సకాలంలో ఏర్పాటు చేయని కారణంగా కేంద్రం నుంచి నిధుల విడుదలలో తీవ్ర జాప్యమైంది.
Central Government Objection to Diversion of Finance Commission funds : పంచాయతీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి, ఆర్థిక సంఘం నిధులు వాటిలో జమ చేయాలన్న ఆదేశాల అమలులోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2022-23కి సంబంధించిన తొలి విడత 689 కోట్ల రూపాయల నిధులు ఏడాది ఆలస్యంగా 2023-24లో విడుదలయ్యాయి. రెండో విడత రావలసిన మరో 689 కోట్లు ఇప్పటికీ కేంద్రం నుంచి రాలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో రెండు విడతల్లో 14 వందల21.70 కోట్ల రూపాయలు విడుదల కావలసి ఉంది. ఇవి ఎప్పటికి వస్తాయో ఇంకా స్పష్టత లేదు.SPOT
Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు
కేంద్రం 2022-23 ఏడాదికి సంబంధించి తొలి విడతగా విడుదల చేసిన 689 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధుల (Finance Commission Funds) నుంచి పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద 352.45 కోట్ల రూపాయలను విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించారు. ఆయా పంచాయతీల తీర్మానం, సర్పంచుల అనుమతులు తీసుకోకుండానే.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నిధులను డిస్కంలకు సర్దుబాటు చేసింది.
2019-20, 2020-21లో విడుదలైన నిధుల్లో పంచాయతీల పీడీ ఖాతాల నుంచి 950 కోట్ల రూపాయలకు పైగా అలా మళ్లించారు. ఆర్థిక శాఖ ద్వారా ఈ వ్యవహారం నడిపించారు. పీడీ ఖాతాల నుంచి డిస్కంలకు నేరుగా నిధులు చెల్లించటం నిబంధనలకు విరుద్ధమైనా, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.