ETV Bharat / state

40 వేల పింఛన్లకు కోత.. ఆందోళనలో బాధితులు - పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత

40 Thousand Pensions Cut: 40 వేల సామాజిక భద్రత పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత వేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులకు ఇచ్చే డిసెంబరు, జనవరి నెల పింఛన్ల పరిశీలనలో ఈ తగ్గింపు కనిపించింది. ప్రభుత్వం ఏ కారణంతో తొలగించిందీ ఎక్కడా వెల్లడించ లేదు.

pension
pension
author img

By

Published : Jan 1, 2023, 7:59 AM IST

40 Thousand Pensions Cut: 40 వేల సామాజిక భద్రత పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత వేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులకు ఇచ్చే డిసెంబరు, జనవరి నెల పింఛన్ల పరిశీలనలో ఈ తగ్గింపు కనిపించింది. గత నెల 62 లక్షల 31 వేల 221 మందికి పింఛన్లను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి 2 లక్షల 31 వేల కొత్త పింఛన్లు కలుపుకుని 64 లక్షల6 వేలమందికి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు నెలల మధ్య పింఛన్ల పంపిణీ తేడాను గమనిస్తే 56 వేల వరకు తగ్గింపు ఉంది.

మొత్తం పింఛనుదారుల్లో 16 వేల మంది వరకు మరణించి ఉంటారని అధికారుల అంచనా. ఆ ప్రకారం చూస్తే దాదాపుగా 40 వేల వరకు కోత పడినట్లే. పింఛన్ల కోతపై ప్రభుత్వం వివరాలు గోప్యంగా ఉంచింది. ఆరు నెలల క్రితం కొత్త పింఛన్ల మంజూరు సమయంలోనూ 60 వేల వరకు కోత కనిపించింది.10 రోజుల క్రితం 6 దశల తనిఖీ ప్రక్రియలో భాగంగా లక్షా 60 వేలమందికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం 40 వేల వరకు పింఛన్ల తగ్గింపు ఉండగా ఎవరిని.. ఏ కారణంతో తొలగించిందీ ఎక్కడా వెల్లడించలేదు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.