Somireddy Comments: జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 8మంది చనిపోయి.. 170 మందికి గాయాలైతే.. కనీసం ఒక్కరినీ పరామర్శించలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు బాధ్యతతో పరామర్శించారు, నష్టపరిహారం ఇచ్చారని తెలిపారు. ఏసీ మెకానిక్ చనిపోతే రూ.మూడు లక్షలు, ఆదినారాయణ కుటుంబానికి లక్షన్నర ఇచ్చి మంత్రి కాకాణి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కందుకూరు వెళ్తే కాకాణిని ప్రజలు ముఖం మీద కొడతారన్నారు. 2013లో షర్మిల పాదయాత్రలో మనిషి చనిపోతే కనీసం పరామర్శించలేదని సోమిరెడ్డి దుయ్యబట్టారు.
రాష్ట్రంలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి స్పందించే వరకూ.. ముఖ్యమంత్రికి స్పందించే తీరిక లేదా అంటూ మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణికి దమ్ముంటే చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల నస్టపరిహారం ముఖ్యమంత్రికి చెప్పి ఇప్పించాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
"ఈ నెల 28వ తేదీన కందుకూరులో జరిగిన సంఘటన దురదృష్టకరం. అయినా ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఇంకా అనేక మంది మంత్రులు మాట్లాడే తీరు చూస్తా ఉంటే.. చంద్రబాబు నాయుడే చంపేసారు అంట.. ఇప్పుడు చంద్రబాబుపై, అక్కడ ఉండే ఇంచార్జ్‌పై మర్డర్ కేసు బుక్ చేయాలంట.. కొంచం అయినా సిగ్గు ఉండాలయ్యా.. మాట్లాడేటప్పుడు. ఎంత మంది చనిపోయారయ్యా మీ పాదయాత్రలో.. 8 మంది చనిపోయారు. 170 మందికి గాయాలయ్యాయి". -సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు
ఇవీ చదవండి: