ETV Bharat / state

ఏళ్లు గడిచినా పూర్తి కాని సర్వీస్​ రోడ్లు - హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోని పరిస్థితి

Service Roads Problems at Benz Circle in Vijayawada : విజయవాడ బెంజ్‌సర్కిల్ వద్ద పైవంతెనలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం సర్వీసు రోడ్ల విస్తరణ మరిచింది. ఏళ్లు గడిచినా సర్వీసు రోడ్లు సరిగా లేక ప్రజలు, వాహనదారులు నరకం చూస్తున్నారు. ఫ్లైఓవర్​ను ప్రారంభించి రెండేళ్లయినా వాటికి ఇరువైపుల ఉన్న సర్వీసు రోడ్ల నిర్మాణాల ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. రోడ్లు వేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కార్యరూపం దాల్చకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Service_Roads_Problems_at_Benz_Circle_in_Vijayawada

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 10:32 PM IST

ఏళ్లు గడిచినా పూర్తి కాని సర్వీస్​ రోడ్లు - హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోని పరిస్థితి

Service Roads Problems at Benz Circle in Vijayawada : విజయవాడలోని నోవాటెల్ హోటల్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు మొదటి ఫ్లైఓవర్ నిర్మాణం కుంచించుకుపోవడంతో దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని భారతీనగర్ తో పాటు దాని సమీప కాలనీలవాసులు హైకోర్టును ఆశ్రయించారు. సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదనలు విన్న కోర్టు సర్వీసు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని, నిబంధనల ప్రకారం 8 మీటర్లకు తగ్గకుండా సర్వీస్ రోడ్డును అభివద్ధి చేయాలని నాడు సింగిల్ జడ్జి ఎన్.హెచ్.ఏ.ఐ.(NHIA) ని ఆదేశించింది.

వైసీపీ పాలకుల నిర్లక్ష్యం - నాలుగున్నరేళ్ల పాలనలో 20 శాతం పనులనూ పూర్తి చేయని ప్రభుత్వం

Condition of Service Roads at Benz Circle : అయితే సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని ఎన్.హెచ్.ఏ.ఐ. సవాల్ చేసింది. ఇదిలా ఉండగా రెండో ప్లైఓవర్‌ను ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డును అభివద్ధి చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కొంత మంది స్థానికులు అప్పటిలోనే రిట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​లో ఫకీర్ గూడెం జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించేలా ఎన్.హెచ్.ఏ.ఐ. ని ఆదేశించాలని వారు కోర్టును అభ్యర్థించారు. రెండు అంశాలు ఒకే స్వభావంతో ఉన్నందున రెండింటిని కలిపి న్యాయస్థానం విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సర్వీస్ రోడ్లు వేయాలని అభిప్రాయపడింది. ఎన్.హెచ్.ఏ.ఐ. దాఖలు చేసిన రిట్​ను కోర్టు కొట్టివేస్తూ సర్వీస్ రోడ్లు వేయాలని ఆదేశించింది. భూసేకరణకు అయ్యే ఖర్చును ఎన్.హెచ్.ఏ.ఐ. మరియు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఇరువురు చర్చలు జరిపి చర్యలు చేపట్టాలని కోర్టు పేర్కొంది.
Traffic Diversion: బెంజ్​ సర్కిల్​ పైవంతెన పనులు..ట్రాఫిక్​ మళ్లింపు

High Court Orders on Service Roads at Benz Circle : రోడ్ల విస్తరణ పనులు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని హైకోర్టు ఆదేశించి దాదాపు రెండున్నర ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభించలేదు. దీంతో 70కి పైగా కాలనీల వాసులతోపాటు రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎన్.హెచ్.ఏ.ఐ. ఇంకా భూమిని సేకరించే ప్రక్రియలోనే ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి సర్వే పూర్తి చేసి అవసరమైన భూమిని గుర్తించింది. భూ సేకరణ, భవనాల తొలగింపు ఇంత వరకు ప్రారంభం కాలేదు. అసలు ఎన్ని బిల్డింగులని తొలగించాలి, భవనాలను తొలగించినందుకు ఎంత నష్ట పరిహారం చెల్లించాలనేదానిపై ఇంత వరకు స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో సర్వీస్ రోడ్లు ఎప్పటికి పూర్తవుతాయో అర్థకాని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Benz circle road: విజయవాడ బెంజ్‌ సర్కిల్ పైవంతెన ఇరువైపులా రోడ్లు వేయండి: హైకోర్టు

లక్షల రూపాయలతో తాము ఈ ప్రాంతంలో ఇళ్లు కొనుగోలు చేశామని అయితే నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.