ETV Bharat / state

ఎల్లలు దాటిన తెలుగు సంస్కృతి.. సింగపూర్​లో ఘనంగా సంక్రాంతి సంబరాలు - Kakatiya Cultural Parivar

Singapore Sankranti Celebrations : సంక్రాంతి పండగను తెలుగుదేశపు ఎల్లలు దాటి నిర్వహించుకున్నారు. దేశం మారినా.. పుట్టి పెరిగిన సంస్కృతిని మర్చిపోకుండా.. సంక్రాంతి పండగ సంబరాలను నిర్వహించుకున్నారు. సింగపూర్​లో జరిగిన ఈ సంబరాల్లో తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 31, 2023, 4:21 PM IST

Sankranti Celebrations In Singapore : జన్మభూమికి దూరంగా సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కాకతీయ సాంస్కృతిక పరివారం ఆధ్వర్యంలో ఈ సంబరాలను కోలాహలంగా నిర్వహించారు. భావితరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, పండుగల గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో చిన్నారుల ఆటపాటలు, ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకరికొకరు పరిచయాలు పెంచుకునేలా వేడుకలకు రూపకల్పన చేసినట్లు సంస్థ అధ్యక్షులు పాతూరి రాంబాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్వహించిన చిన్నారుల ఆటపాటలలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా వివిధ సాంస్కృతిక నృత్యాలు చేసి అబ్బురపరిచారు. తెలుగు సంప్రాదాయలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. తెలుగు సాంప్రదాయ వంటల ప్రదర్శననూ నిర్వహించారు. చిన్నారులకు ఆటల పోటీలను సైతం ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.

సింగపూర్​లో ఘనంగా సంక్రాంతి సంబరాలు..

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.