Sachivalayam Office Maintenance With Panchayat Funds : గ్రామ సచివాలయాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. గ్రామ పంచాయతీలకు సచివాలయాలతో ఏమాత్రం సంబంధం లేదు. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్‌లను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) దశాబ్దాలుగా ఉన్న పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. వాటిపై కనీసం సర్పంచ్‌ల నీడ కూడా పడకుండా ప్రత్యేకంగా రాష్ట్ర సచివాలయాలశాఖను ఏర్పాటు చేశారు.
Panchayat Funds diverted in AP : వాలంటీర్ల నుంచి సచివాలయాల్లోని ఉద్యోగుల వరకు అందరూ ఆ శాఖ ఆధ్వర్యంలోనే పని చేస్తున్నారు. కానీ సచివాలయాల నిర్వహణకు మాత్రం పంచాయతీ నిధులను ప్రభుత్వం వాడేసుకుంటోంది. సర్పంచులు సహకరించని చోట కార్యదర్శుల మెడపై కత్తి పెట్టి మరీ నిధులు ఖర్చు చేయిస్తోంది. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు విద్యుత్తు ఛార్జీల (Electricity Charges)కు మళ్లించి పంచాయతీలను నట్టేట ముంచిన ప్రభుత్వం.. చివరకు సచివాలయాల నిర్వహణకు పంచాయతీల సాధారణ నిధుల్లోంచి ఏటా దాదాపు 100 కోట్లు బలవంతంగా లాక్కుంటోంది. చెక్‌పవర్ రద్దు చేస్తామంటూ బెదిరించి మరీ సర్పంచ్ (Sarpanch)లతో బిల్లులపై సంతకాలు చేయిస్తున్నారు.
Secretariats Management Burden on Panchayats : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ భారాన్ని ప్రభుత్వం పంచాయతీల పైకి నెట్టింది. ఒక్కో సచివాలయానికి నిర్వహణ ఖర్చుల కోసం నెలకు 15 వందల రూపాయలు ఇస్తామని బ్యాంకు ఖాతాలు తెరిపించిన ప్రభుత్వం.. మూడు నెలల మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో విద్యుత్తు బిల్లులు, స్టేషనరీ, ప్రింటర్ నిర్వహణ పేరుతో ఒక్కో సచివాలయానికి నెలకు దాదాపు 7 వేల వరకు ఖర్చు అవుతోంది. దీనికోసం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధుల్లోంచి ఖర్చు చేస్తున్నారు.
Burden on Panchayats in YSRCP Government : సచివాలయాల నిర్వహణకు నిధులు ఇవ్వని ప్రభుత్వం వాటిపై వచ్చే రాబడి మాత్రం తీసుకుంటోంది. ఏటా సేవలపై దాదాపు 150 కోట్ల ఆదాయం వస్తోంది. వాటిని సచివాలయాల నిర్వహణకు వెచ్చించడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. సచివాలయాల పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదు. మిగతా సొమ్ము పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు.
పంచాయతీ ఖాతాలు ఖాళీ.. ఏకగ్రీవ నిధులూ విద్యుత్తు ఛార్జీలకే!
షామియానా, కుర్చీలు, తాగునీటి సదుపాయం, బ్యానర్లు, అల్పాహారం, టీ, భోజనం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేయిస్తుండటంతో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం అమవుతున్నాయి. 2021-22లో చేసిన వ్యయంపై దాదాపు 2,800 పంచాయతీల్లో ఆడిట్ అధికారులు తప్పుపట్టారు.
Sarpanches Problems in AP: నిధుల కొరతతో సర్పంచుల అవస్థలు.. బ్లీచింగ్‌కూ డబ్బుల్లేని పరిస్థితి