APCLA FIGHT AGAINST GO-1: బ్రిటీషోళ్లు తెచ్చిన జీవోను నేటి పాలకులు అమలు చేయటం నిరంకుశత్వానికి నిదర్శనమని.. విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే జీవో నెంబర్ 1 ను జగన్ ప్రభుత్వం ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సభలు, ర్యాలీలు, పాదయాత్రలను నిలువరించటంపై అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉందంటూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. విపక్షాలను అణిచివేసేందుకే జీవో నెంబర్ 1ను తెచ్చారని తెలుగుదేశం, జనసేన నేతలు ధ్వజమెత్తారు.
విజయవాడ బాలోత్సవ భవన్‌లో జీవో నెంబర్ 1పై ఏపీ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు . ప్రశ్నించే గొంతుల్ని నొక్కేందుకే ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని ఐఏఎస్ ,ఐపీఎస్ లు వైకాపా కార్యకర్తలుగా మారుతున్నారని ఆరోపించారు . -ముప్పాళ్ల సుబ్బారావు ఏపీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్టదని...రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలే ఇందుకు నిదర్శనమని వక్తలు అభిప్రాయపడ్డారు.-వడ్డే శోభనాద్రీశ్వర్రావు ,మాజీ మంత్రి
అధికార పార్టీ నేతల జీవో నంబర్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని వామపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. -రామకష్ణ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
జీవో నెంబర్ 1ను వ్యతిరేకిస్తూ జవనరి 26 న జాతీయపతాకలతో ప్రదర్శనలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. గాంధీ వర్ధంతి రోజున ఆయన విగ్రహాల వద్ద మౌనదీక్షలు చేయనున్నారు.
ఇవీ చదవండి