Recommendations Of Koneru Ranga Rao Land Committee: నవరత్నాల్లో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను చేర్చి.. రాష్ట్రంలో పేదలకు వెంటనే భూ పంపిణీ చేయాలని రాష్ట్రస్థాయి భూసాధన సదస్సు తీర్మానించింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తండ్రి ఆశయాలు నెరవేరుస్తానన్న జగన్.. రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపొందించిన కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో 59 శాతం గ్రామీణ ప్రజానీకానికి భూములు లేవని.. పేదలకు అనుకూలంగా ఎన్ని చట్టాలు వచ్చినా.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.. పేదలకు భూమి పంచాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. భూమి ఉంటేనే పేదలకు ఆత్మగౌరవం ఉంటుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. అవి పాలకుల కనుసన్నల్లోకి.. పెద్దల చేతుల్లోకి, భూమాఫియా చేతుల్లోకి వెళ్తోందని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: