ETV Bharat / state

సంకల్ప సిద్ధి కుంభకోణం.. కీలక నిందితుడు కిరణ్​ అరెస్ట్​.. 25వరకు రిమాండ్​

SANKALP SIDDHI SCAM LATEST UPDATES : సంకల్పసిద్ధి మోసంలో కీలక నిందితుడిగా భావిస్తున్న కిరణ్‌ను అరెస్టు చేసినట్లు విజయవాడ సీపీ చెప్పారు. ఇటీవల అతడిని కర్ణాటకలో అరెస్టు చేసి, విజయవాడకు తీసుకొచ్చారు.

SANKALP SIDDHI SCAM LATEST UPDATES
SANKALP SIDDHI SCAM LATEST UPDATES
author img

By

Published : Apr 13, 2023, 10:02 AM IST

SANKALP SIDDHI SCAM LATEST UPDATES : రాష్ట్రంలో సంకల్ప సిద్ధి గొలుసు కట్టు మోసం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న కిరణ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అతడిని కర్ణాటకలో అరెస్టు చేసి, విజయవాడకు తీసుకొచ్చారు. విచారణ అనంతరం మూడో ఏసీఎంఎం కోర్టులో న్యాయమూర్తి రాజశేఖర్‌ ఎదుట హాజరుపర్చారు. కుంభకోణంలో కిరణ్‌ పాత్ర ఉన్నందున అరెస్టు చేసినట్లు, రిమాండ్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఏపీపీ శశికళ కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈనెల 25వరకు నిందితుడికి రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక కారాగారానికి తరలించారు.

సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత కిరణ్‌ విజయవాడ నుంచి కర్ణాటక పారిపోయాడు. అతని కోసం పలు బృందాలతో పోలీసులు గాలించినా దొరకలేదు. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో స్నేహితుల వద్ద ఆశ్రయం తీసుకున్నాడు. ఇటీవల కిరణ్‌ కుటుంబ సభ్యుల ఫోన్‌ కాల్స్​పై పోలీసులు నిఘా పెట్టారు. ఈ సందర్భంగా వారి ఫోన్ల నుంచి కిరణ్‌ మిత్రులకు వెళ్తున్నట్లు గుర్తించారు. వాటిని వడపోసి, ఎట్టకేలకు నిందితుడి ఆచూకీ కొనుగొని అదుపులోకి తీసుకున్నారు. మరింత లోతైన విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసులు తమ కస్టడీ తీసుకుని విచారించేందుకు సమాయత్తం అవుతున్నారు. దీని కోసం త్వరలో కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ మనీ సర్క్యులేషన్‌ కేసులో.. ప్రధాన నిందితుడు గుత్తా వేణుగోపాల్‌తోపాటు.. గుత్తా కిషోర్, మావూరి వెంకట నాగలక్ష్మి, గంజాల లక్ష్మీ.., సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌లను పోలీసులు 2022 నవంబర్​28న అరెస్టు చేశారు.

సంకల్ప సిద్ధి కుంభకోణం.. కీలక నిందితుడు కిరణ్​ అరెస్ట్​.. 25వరకు రిమాండ్​

"ఈ కేసులో అందరినీ అరెస్టు చేశాము. మొత్తం 46మందిని అరెస్టు చేశాం. ఈ కేసులో ఇన్వాల్వ్​ అయిన డైరెక్టర్లు, మెయిన్​ ఏజెంట్స్​, జిల్లా, రాష్ట్ర కమిటీ మెంబర్స్​ను అరెస్టు చేశాము. దాదాపు 40కోట్ల రూపాయల విలువ గల ప్రాపర్టీని సీజ్​ చేశాము. కస్టడీ కోసం కోర్టులో పిటిషన్​ కూడా వేయనున్నాం"- కాంతిరాణా టాటా, విజయవాడ సీపీ

నవంబర్​లో వెలుగుచూసిన కుంభకోణం: 2022 నవంబరులో వెలుగు చూసిన సంకల్ప సిద్ధి కుంభకోణం రూ.130 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తం 17 బ్యాంకు ఖాతాల ద్వారా అధిక శాతం లావాదేవీలు జరిగినట్లు తేలింది. డిపాజిటర్ల సంఖ్య 45వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసినా కీలక సూత్రధారి కిరణ్‌ పట్టుబడక పురోగతి లోపించింది. ప్రత్యేక బృందాలు బెంగళూరు, బళ్లారి, అనంతపురం, తదితర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు దొరకడంతో ఈ కేసులో చిక్కుముళ్లు వీడే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.