Petrol Bunks : నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో నగదు రహిత లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ప్రజలు నగదు రహిత చెల్లింపులు ఎక్కువగా చేయాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు డిజిటల్ చెల్లింపులకే మెగ్గు చుపుతున్నారు. కానీ విజయవాడలోని పలు పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డులు అంగీకరించబడవు అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. డెబిట్ కార్డుల ద్వారా లావాదేవిలను నిలిపివేయడం ప్రస్తుతం చర్చంశనీయంగా మారింది.
ఒకలీటరు పెట్రోల్‌పై బంకు నిర్వహణ యజమానులకు కమిషన్ కింద 3.20, డీజిల్‌పై 2.10 మాత్రమే వస్తుందని పెట్రోల్ డీలర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. దీనిలోనే విద్యుత్తు ఛార్జీలు, అద్దెలు, సిబ్బంది జీతభత్యాలు అన్నీ ఖర్చులు ఉంటాయని చెప్పారు. ఈ కమిషన్‌లో కార్డులు వినియోగించడం ద్వారా 100 రుపాయల వినియోగానికి రుపాయన్నర నుంచి రెండు రుపాయల వరకు మర్చంట్ ఛార్జీలు చెల్లిస్తే ఇక మిగిలేదేమీ ఉండదని వివరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 350 వరకు బంకులు ఉన్నాయని, ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీసీ, రిలయన్సు కంపెనీలు ఉన్నాయని చెప్పారు. రోజుకు పెట్రోలు 1500 కిలో లీటర్లు, డీజిల్ 2,500 కిలో లీటర్లు వినియోగం అవుతుందన్నారు. పెట్రోలు 111.66, డీజిల్ 99.43 వరకు ధర ఉందన్నారు. రోజూ కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఎక్కువ శాతం డిజిటల్ చెల్లింపులే ఉంటాయి. కనీసం 50 శాతం నగదు ఉన్నా.. 50శాతం డిజిటల్ చెల్లింపులు ఉంటే డెబిట్ కార్డులు అంగీకరించబోమమని బంకు యజమానులు చెబుతున్నారు. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం వాటిని అనుమతిస్తున్నారు. ఇండియన్ అయిల్ కంపెనీ వారు వారి డిలర్ల కోసం ప్రత్యేకంగా రుపోందిన నగదు చెల్లింపుల పరికరాన్ని అందించారని, ఆ పరికరంలో దాదాపు నాలుగైదు దశల్లో వినియోగదారుల వివరాలు పొందుపరిస్తే తప్ప నగదు చెల్లింపులు జరగడం లేదని డీలర్లు వాపోతున్నారు. ఒక్క డిజిటల్ చెల్లింపుకే దాదాపు 5 నిమిషాల సమయం పడుతుందన్నారు. దీని వల్ల సమయం వృధా అవుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటూన్నారు.
ఇవీ చదవండి