ETV Bharat / state

ఆసుపత్రిలో బెడ్లు లేవని రోగిని బయటకు పంపిన వైద్యులు - రాత్రంతా చలిలో ఉండి మృతి - patient Kannayya from Theragudeni news

Patient Died for no Beds in Vijayawada Govt Hospital : ప్రభుత్వ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. వైద్యం అందించాల్సిన డాక్టర్లే రోగి మరణానికి కారణమవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనే దీనికి నిలువెత్తు సాక్ష్యం. తీవ్ర అనారోగ్యంతో వైద్యం కోసం వచ్చిన రోగిని ఆసుపత్రిలో బెడ్ లేదనే సాకుతో రాత్రి సమయంలో ఇంటికి వెళ్లిపొమ్మన్నారు. దిక్కుతోచని స్థితిలో రోగి బంధువులు ఆసుపత్రిలో ఆరుబయటే నిరీక్షించారు. తెల్లారే సరికి రోగి మరణించటం కలకలం రేపింది.

Patient_Died_for_no_Beds_in_Vijayawada_Government_Hospital

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 12:15 PM IST

ఆసుపత్రిలో బెడ్లు లేవని రోగిని బయటకు పంపిన వైద్యులు - రాత్రంతా చలిలో ఉండి చనిపోయిన రోగి

Patient Died for no Beds in Vijayawada Government Hospital : పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తాం అని పబ్లిసిటీ ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రికి తీవ్ర అనారోగ్యంతో వచ్చిన రోగిని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి మంచాలు లేవని చెబుతూ, కేవలం తాత్కాలిక వైద్యం అందించారు డాక్టర్లు. తరువాత ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పడంతో అతని ప్రాణాల మీదకు వచ్చింది.

ఆస్పత్రిలో మందులేవి జగనన్న..?పడకేసిన ప్రభుత్వాసుపత్రులు

Patient Died due to Negligence of Doctors : రోగి కుటుంబసభ్యలు చెప్పిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం తేరగూడేనికి చెందిన వీరాబత్తిని కన్నయ్య (62) ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ విజయవాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు, కన్నయ్యకు ఊపిరితిత్తుల్లో గడ్డ ఉందని చెప్పారు. ఖర్చు ఎక్కువ అవుతుందని వైద్యులు తెలపడంతో కన్నయ్యను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.

Deaths of Patients in AP : వైద్యులు కన్నయ్యను ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. తరువాత రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆసుపత్రిలోని వార్డుల్లో మంచాల కొరత ఉందనీ, ఇంటికి వెళ్లిపోయి మరుసటి రోజు రమ్మని తెలిపారు. కన్నయ్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని అతని కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా వైద్యులు వినిపించు కోలేదు. అత్యవసర వైద్యం అందించే క్యాజు వాల్టీలో ఉంచడానికి వీల్లేదనీ, వార్డుల్లో మంచాలు ఖాళీ లేవని చెప్పి బలవంతంగా బయటకు పంపేశారు.

పేదలకు అనారోగ్యం వస్తే, కుటుంబాల ఆస్తులు కరిగిపోవల్సిందేనా..!

Government Hospitals Situation in AP : దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రోగి బంధువులు ఆసుపత్రి ఆవరణలోని బల్లలపైనే రాత్రంతా గడిపారు. తెల్లవారే సరికి చూస్తే కన్నయ్య చనిపోయి ఉన్నాడు. దీంతో కన్నయ్య భార్య మాలక్ష్మి, కుమారుడు చిట్టిబాబు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయాడని ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రిలో ఉంచమని ఎంత బతిమాలుకున్నా వైద్యులు కనికరించలేదు. రాత్రి వేళ వెళ్లిపోమని బయటకు పంపించేశారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పినా ఎవరూ కనీసం వినిపించుకోలేదు. వైద్యం చేశాం కాబట్టి ఏమీకాదు. ఇంటికి వెళ్లి మరుసటి రోజు రమ్మని చెప్పారు. ఆసుపత్రిలో మంచాలులేవనీ, ఉంచడానికి కుదరదని అన్నారు. మా నాన్నకు ఏమవుతుందో అనేభయంతో రాత్రంతా ఆసుపత్రిలోనే ఉన్నాం. ఉదయం చూస్తే నాన్న చనిపోయి ఉన్నారు. మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. - చిట్టిబాబు, కన్నయ్య కుమారుడు

విచారణకు కమిటీ వేశాం..

ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి ప్రత్యేక కమిటీని నియమించామని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్​ఎంవో శోభ తెలిపారు. కన్నయ్యకు వైద్య చికిత్స అందించాక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్న తర్వాతే ఇంటికి వెళ్లమని చెప్పామని ఊపిరితిత్తుల విభాగం వైద్యులు తెలిపారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Medicines Shortage In Govt Hospitals: ఏపీలో ప్రభుత్వాసుపత్రుల డొల్లతనం బట్టబయలు.. పీఏజీ ఆగ్రహం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.