ETV Bharat / state

ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్​, డైరీని ఆవిష్కరించిన నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్ యాప్

NTR Trust Digital Calendar: ఎన్టీఆర్ ట్రస్ట్​ 2023 డిజిటల్ క్యాలెండర్, డైరీని .. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. ఈ యాప్​​ ద్వారా రక్తం కావలసిన వారు ఎంక్వైరీ చేసుకోవచ్చని తెలిపారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ ద్వారా తెలియజేస్తామని అన్నారు.

Nara Bhuvaneswari
నారా భువనేశ్వరి
author img

By

Published : Dec 31, 2022, 6:40 PM IST

NTR Trust Digital Calendar: ఎన్​టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్​లో.. 2023 డిజిటల్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ డిజిటల్ క్యాలెండర్ యాప్​ని అందరూ తమ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ , యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ కావలసినవారు డైరెక్ట్ ఎంక్వైరీ చేసుకోవచ్చని తెలిపారు. రోజువారీ దిన ఫలాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. ఎవరైనా ఎన్టీఆర్ ట్రస్ట్​కి విరాళాలు చేయదలచిన వారు.. ఒక క్లిక్​తో విరాళాలను అందజేయవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్​తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.