Negligence on Vijayawada Yanamalakuduru Bridge: విజయవాడ-యనమలకుదురును కలిపే కీలక వంతెన ఎప్పుడు పూర్తవుతుందోనని.. చాలా ఏళ్లుగా స్థానికులు ఎదురు చూస్తున్నారు. విజయవాడ యనమలకుదురు లాకుల వద్ద బందరు మెయిన్ కాల్వపై డబుల్ లైన్ బ్రిడ్డి నిర్మాణానికి 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగి 12 ఏళ్లయినా ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు. కాల్వ మధ్యలో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటికీ రెండు వైపులా అప్రోచ్ నిర్మించలేదు.
సుమారుగా 20 శాతం పనులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. ప్రస్తుతం పాత తాత్కాలిక వంతెనపైనే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ - యనమలకుదురు మధ్య ప్రాంతాన్ని కలిపే ఈ కీలక వంతెన నిర్మాణానికి చాలా ఏళ్లుగా స్థానికులు ఎదురు చూస్తున్నారు. పాత వంతెన ఇరుకుగా ఉండటంతో.. ట్రాఫిక్ ఎప్పటికప్పుడు నిలిచిపోతోంది. పాత వంతెనపై ఇనుప ఊచలు బయటకు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగి ప్రయాణికులు గాయపడిన సందర్భాలున్నాయి.
Traffic Problems on Yanamalakuduru Lakula Bridge: ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనులపై వెళ్లే కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, వ్యాన్లు వంటివి ఎదురెదురుగా ఒకేసారి వస్తే.. వెళ్లే దారిలేక రద్దీలో చిక్కుకుపోతున్నాయి. ఇవి బయటపడితేగాని పాదచారులు, ద్విచక్ర వాహనదారులు వెళ్లే పరిస్థితి లేదు.
గంటల తరబడి ట్రాఫిక్జామ్: దయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్జామ్ అవుతుందని.. దీని కారణంగా పనులకు కూడా ఆలస్యం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. రోజూ ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
టీడీపీ హయాంలో కీలక పనులు: టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెనకు సంబంధించి కీలక పనులు జరగ్గా.. గడిచిన నాలుగేళ్లుగా బ్రిడ్జి నిర్మాణం వైపు ఎవరూ దృష్టి సారించిన పాపానపోలేదు. గతంలో వంతెన సమస్యపై స్థానికులు ఆందోళన చేపట్టగా.. గడిచిన శివరాత్రికి పనులు పూర్తిచేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని.. ఆ హామీ నేటీకీ నెరవేరలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. గుత్తేదారుకు నిధులు ఆపేయడం వల్లే సమస్య తలెత్తిందని.. తక్షణం ప్రభుత్వం నిధులు విడుదల చేసి వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Bugga Vanka Bridge: బుగ్గవంక రక్షణ గోడపై బ్రిడ్జి కట్టేదెప్పుడు..? పట్టించుకునేవారే కరువాయే..!
చిన్నపాటి ఖర్చుతో పూర్తయ్యే వంతెన: శంకుస్థాపన జరిగి 12 ఏళ్లవుతున్నా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెనను ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. వంతెనకు సంబంధించి మిగిలిపోయిన పనుల్ని ఇప్పటికైనా పూర్తిచేయాలని స్థానికులు, ప్రయాణీకులు కోరుతున్నారు. చిన్నపాటి ఖర్చుతో పూర్తయ్యే వంతెన నిర్మాణంపై కూడా శ్రద్ధ వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన పూర్తి చేసి.. తమకు ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
Bridge in Worst Condition: ప్రమాద సూచిక..! శిథిలావస్థకు చేరిన వంతెనను పట్టించుకోని ప్రభుత్వం