ETV Bharat / state

కేంద్రమే ఆసుపత్రులు నిర్మించి ఇస్తామన్నా - ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం

Negligence of AP Government for ESI Hospitals : కేంద్ర నిధులు తీసుకొని.. ప్రజలకు మాత్రం తానే అందిస్తున్నానని ప్రచారం చేసుకోవడంలో.. సీఎం జగన్‌ది అందెవేసిన చేయి. అలా కేంద్ర పథకాలను తమ ఖాతాలో వేసుకొనే శ్రద్ధ.. కార్మికుల ఆరోగ్య విషయంలో మాత్రం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఈఎస్ఐ ఆసుపత్రులు స్వయంగా తామే నిర్మించి ఇస్తామని కేంద్రం చెప్పినా.. స్థలాలను ఎంపిక చేయకుండా వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

Negligence_of_AP_Government_for_ESI_Hospitals

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 8:03 AM IST

Negligence of AP Government for ESI Hospitals : కార్మికుల ఆరోగ్యం విషయమై.. కోట్ల రూపాయల నిధులిచ్చి.. కావాల్సిన సాయం చేస్తామని కేంద్రం చెబుతుంటే.. జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. శ్రమజీవుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తోంది. కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐ(ESI) ఆస్పత్రులు, డిస్పెన్సరీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 87.5శాతం నిధులు ఇచ్చినా.. మిగతా 12.5శాతం నిధులు కేటాయించి.. పర్యవేక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందన్న సంగతిని పట్టించుకోవడం లేదు.

కేంద్రం ఆసుపత్రులు నిర్మించి ఇస్తామన్నా - ఏపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యమే

Central Funding for ESI Hospitals : రాష్ట్రానికి 8 ఆస్పత్రులను మంజూరు చేస్తే.. ఐదు ఆస్పత్రులకు ప్రభుత్వం స్థలాలనే కేటాయించలేదంటేనే.. ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 3 డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఉండగా.. 13లక్షల మందికి పైగా కార్మికులున్నారు. వీరి కుటుంబసభ్యులను కలిపితే 40లక్షల మందిపైనే ఉంటారు. మరిన్నిచోట్ల ఆసుపత్రులు అవసరం.

ఈఎస్​ఐ కుంభకోణంలో ఆధారాలు చూపినా.. సీఎం స్పందించరే : లోకేశ్

అందుకే గుంటూరు, విజయనగరం, కాకినాడ, సత్యసాయి జిల్లా పెనుగొండ, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, తిరుపతి జిల్లా శ్రీసిటీ ఆస్పత్రుల నిర్మాణానికి 2021 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా.. అనుమతులు ఇచ్చింది. వీటిలో విజయనగరం, కాకినాడ మినహా మిగతా చోట్ల ఎలాంటి నిర్మాణాలూ ప్రారంభమే కాలేదు. ఈ ఏడాది కర్నూలు, నెల్లూరుకు మరో రెండు ఆస్పత్రులు మంజూరయ్యాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు.

State Govt Funding for ESI Hospitals : అచ్యుతాపురం సెజ్‌తో పాటు పరవాడ ఫార్మా సిటీలో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతుంటే.. కార్మికులకు కనీస వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. విశాఖ, అనకాపల్లి ఆస్పత్రులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అచ్యుతాపురం సెజ్‌లో 30పడకల ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం 2021లో మంజూరు చేసింది. రెండెకరాల స్థలాన్ని ఏపీఐఐసీ (APIIC).. ఈఎస్ఐ కార్పొరేషన్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసింది.

నెరవేరని ఈఎస్‌ఐ ఆసుపత్రి కల.. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం

వైద్యులు, సిబ్బంది నివాసానికి అదనంగా కొంత స్థలం కావాలని కార్పొరేషన్‌ కోరగా.. కేటాయింపునకే మూడేళ్లు పట్టింది. గుంటూరు నగరంలోని ఆసుపత్రికి స్థలం చూడగా.. అది సరిపోదని కేంద్ర కార్పొరేషన్‌ సూచించింది. అలాగే ఆస్పత్రిని నగర శివారులో నిర్మించాలన్న ఓ ఎంపీ సూచనతో.. ఎక్కడ నిర్మించాలనే దానిపై గందరగోళం నెలకొంది.

Employees State Insurance : శ్రీసిటీలోని కార్మికుల కోసం 100 పడకలతో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మిస్తామని 2020 జూన్‌ 10న మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. స్థల ఎంపిక పూర్తి చేసినా.. కార్పొరేషన్‌కు అప్పగించలేదు. కియా పరిశ్రమలో పని చేసేవారి కోసమని.. పెనుకొండకు కేంద్రం ప్రభుత్వం ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరు చేసింది. ఇక్కడ స్థల పరిశీలన పూర్తి చేశారు కానీ.. భవన నిర్మాణాలు చేపట్టేందుకు చేయాల్సిన ప్రక్రియలో జాప్యం నెలకొంది.

Ap Govt Delay in Construction of ESI Hospitals : నెల్లూరు, కర్నూలులో ఆస్పత్రి నిర్మాణానికి స్థలాల పరిశీలనే పూర్తి కాలేదు. స్థలాలు చూసినా.. ఎంపిక చేయలేదు. విజయగనరం, కాకినాడ, విశాఖలో జరుగుతున్న ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. విజయనగరంలో 100పడకల ఆస్పత్రిని 2023 మార్చిలోగా పూర్తి చేస్తామని.. 2021లోనే ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. కొత్త గడువు 2025నాటికి అని చెబుతున్నారు. విశాఖ అక్కిరెడ్డిపాలెం పరిధిలోని షీలానగర్‌లో 500 పడకలకు గానూ.. 350 పడకల నిర్మాణం ప్రారంభించారు. లోతట్టు ప్రాంతం, వాగు పక్కనే ఉందనే కారణాలతో పనుల ప్రారంభంలో జాప్యం ఏర్పడింది. నిర్మాణమూ ఆలస్యమవుతోంది.

ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో అవకతవకలపై కమిటీ: మంత్రి జయరాం

విజయవాడ గుణదలలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి వివిధ జిల్లాల నుంచి కార్మికులు వైద్య సేవలకు వచ్చేవారు. భవనం శిథిలావస్థకు చేరడంతో కేవలం ఓపీ మాత్రమే చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని యోచిస్తోంది. స్థలాన్ని కేంద్రానికి అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆస్పత్రికి అప్పగించేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది కానీ.. వారు అడిగినవన్నీ ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.