Nachindi Girlfriend Movie Trailer: 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ' సినిమా టీజర్‌ని విజయవాడ ఫార్చ్యూన్ మురళీ పార్క్ హొటల్లో ఆ చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా ఉదయ్‌శంకర్, జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ నటించారు. ఈ నెల 11న థియేటర్ల ముందుకు రానుందని తెలిపారు. ఈ చిత్రానికి గురువు పవన్ దర్శకత్వం వహించారు. స్నేహం, ప్రేమ కథాశంతో తమ సినిమా తెరకెక్కిందని.. సినిమా హీరో గాజుల ఉదయ్‌శంకర్ తెలిపారు. ఒక్కరోజులో జరిగే కథే ఈ చిత్రమన్నారు. 95శాతం సినిమాని విశాఖపట్నంలోనే పూర్తి చేశామన్నారు. మిగతా సినిమాను హైదరాబాద్, గోవాలో పూర్తి చేశామన్నారు.
స్నేహం, ప్రేమ, హాస్యంతో పాటు కుంటుంబ సభ్యుల విలువ తెలిసే విధంగా కథ ఉందని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఎలాగో.. తనకు 'నచ్చింది గర్ల్ ఫ్రెండ్' సినిమా అలాగన్నారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్‌తో పాటు దర్శకుడు గురుపవన్, సహ నటుడు మధునందన్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి