ETV Bharat / state

మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక - బహిష్కరించిన మున్సిపల్​ కార్పోరేషన్​ ఉద్యోగులు

Municipal Workers Strike in AP : సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె సైరన్​ మోగించారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా సీఎం జగన్​ హామీలు నెరవేర్ఛలేదంటూ విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

municipal
municipal
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 6:56 PM IST

Municipal Workers Strike in AP : రాష్ట్రవ్యాప్తంగా పురపాలక పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ నగరపాలక, పురపాలక కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక

Municipal Workers Strike in Vijayawada : ప్రతిపక్షనేతగా పాదయాత్రలో హామీలిచ్చిన జగన్ వాటిని అమలు చేయకపోవడం వల్ల ఒక్కొక్కరుగా రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన తెలిపారు. కనీస వేతనంతో పాటు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. నందిగామలో పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పురపాలక కార్యాలయాల ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. మంగళగిరిలో బలవంతంగా చెత్తను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ వద్ద నిరసనకు దిగారు.

సమ్మె బాటలో మున్సిపల్​ కార్మికులు - జగనన్నా రాష్ట్రమంతా ధర్నాచౌక్​ అవుతుంది చూడన్నా!

Municipal Workers Strike in Eluru District : ఏలూరులో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముమ్మడివరం నగరపంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ ర్యాలీ చేశారు. అనంతరం పురపాలక కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. విశాఖలో కార్మికుల సమ్మెతో చెత్త సేకరణ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విశాఖలో మొత్తం 5,700 మంది సమ్మెలో పాల్గొన్నారు. రైల్వే న్యూ కాలనీ నుంచి జీవీఎమ్​సీ గాంధీ విగ్రహం వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పురపాలక కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ వద్ద బైఠాయించి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

విజయవాడలో మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు - తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Municipal Workers Strike in Rayalaseema : రాయలసీమ జిల్లాల్లోనూ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు దిగారు. అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కళ్యాణదుర్గం పురపాలక కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించారు. కడపలో కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.

Municipal Workers Demands : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింపజేయాలని, రిస్క్​ అలవెన్సు రూ.25 లక్షల బీమా ప్రీమియం స్థానిక సంస్థల ద్వారా చెల్లించాలని డిమాండ్​ చేశారు. సమాన పనికి సమాన వేతనం, క్లాప్​ డ్రైవర్లకు రూ.18500 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.