ETV Bharat / state

తెలంగాణ ఆడబిడ్డలు భయపడేదేలే.. వెనక్కి తగ్గేదేలే.. : కవిత - MLC Kavitha fires on BJP latest news

MLC Kavitha Fires On BJP: దేశంలో ఎవరు ప్రశ్నిస్తే వారితో దర్యాప్తు సంస్థలు మాట్లాడుతున్నాయని.. వాటి బెదిరింపులకు భయపడేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీజేపీ వైఫల్యాలపై మాట్లాడిన వారిపై దాడి జరుగుతుందన్న ఆమె.. దేశంలో నెలకొన్న పరిస్థితులతో మేధావుల్లోనూ నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమతరహాలో దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఏకం చేస్తామని కవిత వెల్లడించారు.

kavitha
kavitha
author img

By

Published : Dec 12, 2022, 8:34 PM IST

MLC Kavitha Fires On BJP: దిల్లీ మద్యం కేసు వ్యవహారంలో నిన్నంతా సీబీఐ విచారణ ఎదుర్కొన్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో జరిగిన తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పద్ధతి ప్రకారం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించిన ఆమె.. ఇలాంటి పరిస్థితుల కారణంగానే కవులు, రచయితలు మౌనంగా ఉండిపోతున్నారని చెప్పారు. దేశంలో అనేక అంశాల పట్ల ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కవిత తెలిపారు.

దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని చేస్తున్న బెదిరింపులకు భయపడేదిలేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులు వస్తాయన్న ఆమె.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో.. దేశంలో మరో ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.

తెలంగాణ ఆడపిల్లలు భయపడేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు: కవిత

"కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు ప్రశ్నించినా ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారు. కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గొంతెత్తే ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్తాం. ఈలోగా మన సత్తా చూపిద్దాం. వ్యవస్థలతో దాడులు చేయిస్తూ మన సమయం వృథా చేస్తున్నారు. మిగతా సమయాన్ని మన సత్తా చాటేందుకు ఉపయోగిద్దాం. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులు వస్తాయి. తెలంగాణ ఉద్యమం తరహాలో.. దేశంలో మరో ఉద్యమాన్ని చేపడతాం." - కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.