ETV Bharat / state

రాజధాని కాదు.. ప్రభుత్వ పాలన చూసి పెట్టుబడులొస్తాయి: మంత్రి వేణుగోపాల్‌

MINISTER CHELLUBOINA : రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతంగా ఉందని.. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందు ఉందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ తెలిపారు. కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

MINISTER CHELLUBOINA
MINISTER CHELLUBOINA
author img

By

Published : Feb 13, 2023, 3:39 PM IST

Updated : Feb 13, 2023, 4:05 PM IST

MINISTER CHELLUBOINA ON GSDP : పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఏపీ ఆకర్షిస్తోందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్ర జీఎస్‌డీపి 11.34 శాతంగా ఉందని.. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రం చాలా ముందు ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ సమయంలో వృద్ధి రేటు మైనస్​లోకి వెళ్లినప్పుడు కూడా ఏపీ మంచి వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. తలసరి ఆదాయం కూడా 38.5 శాతం పెరిగిందని వెల్లడించారు.

కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తుంటే.. ప్రతిపక్షాలు దానికి వంత పాడుతున్నాయని విమర్శించారు. వృద్ధి తిరోగమనంలో ఉన్నట్టు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 జూలై చివరి నాటికి ఏపీకి రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. దేశవ్యాప్తంగా 1.71 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తే అందులో అత్యధికంగా ఏపీకే వచ్చాయని స్పష్టం చేశారు.

"రాజధానిని చూసి పెట్టుబడులు పెట్టరు. పరిపాలన చూసి పెట్టుబడులు పెడతారు. కేవలం చంద్రబాబు అమరావతే రాజధాని అన్నారని.. దానినే కొనసాగించడం అనేది ప్రజాభిప్రాయానికి వేరుగా ఉంది. విభజన చట్టాన్ని అమలు చేయడం కోసం శివరామకృష్ణ కమిషన్​ వేస్తే.. కనీసం ఆ కమిషన్​ను పట్టించుకోకుండ ఆయనకు కావల్సిన కమిషన్​ వేసుకుని.. ఆయన నిర్మాణం చేసుకుంటే దానిని మనం ఒప్పుకోవాలంటే ఎలా"-చెల్లుబోయిన వేణుగోపాల్​, మంత్రి

23,985 కోట్ల రూపాయల పెట్టుబడులకు.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అలయన్స్ టైర్స్ సంస్థ రూ.1040 కోట్ల పెట్టుబడితో విశాఖలో ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం వల్ల దేశ, విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు. ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.

బల్క్ డ్రగ్ పార్కు కోసం రూ.1000 కోట్ల గ్రాంట్​ను ఏపీ సాధించిందని తెలిపారు. కొవిడ్ 19 సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య శ్రేణి పారిశ్రామిక సంస్థలకు రీ స్టార్ట్ ప్యాకేజీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాజధాని కాదు.. ప్రభుత్వ పాలన చూసి పెట్టుబడులు వస్తాయన్నారు. రాజధానికి, పెట్టుబడులకు సంబంధం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. స్వల్ప పెట్టుబడితోనే విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.

మంత్రి వేణుగోపాల్‌

ఇవీ చదవండి:

Last Updated : Feb 13, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.