ETV Bharat / state

మీరు వినండి..! ఇది టీఎస్ఆర్టీసీ రేడియో..!పలు బస్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం - హైదరాబాద్​ తాజా వార్తలు

Radio facility in TSRTC buses: విప్లవాత్మక మార్పులతో తెలంగాణ ​ఆర్టీసీ పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో టికెట్​యేతర ఆదాయంపై దృష్టి సారించిన సంస్థ మంచి ఫలితాలను రాబట్టి ప్రగతి చక్రాలను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా ప్రయాణికులకు వినోదాత్మకమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా బస్సులో రేడియో సదుపాయం కల్పించింది. ఫైలట్​ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్​ సీటీలోని తొలివిడతగా 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

TSRTC బస్సుల్లో రేడియో సౌకర్యం
Radio facility in TSRTC buses
author img

By

Published : Jan 29, 2023, 8:36 AM IST

Radio facility in TSRTC buses: తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలో ముందుకు వెళుతోంది. ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో రేడియో సదుపాయాన్ని కల్పించింది. ముందు ఫైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్​లోని బస్​భవన్‌లో కూకట్‌పల్లి డిపో బస్సుల్లో ఈ రేడియోను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రారంభించారు.

అనంతరం రేడియో పనితీరును ఆయన పరిశీలించారు. రేడియో ఏర్పాటు, అది పనిచేస్తున్న విధానం, సౌండ్‌ తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ పీవీ మునిశేఖర్‌, కూకట్‌పల్లి డిపో మేనేజర్‌ ఇషాక్‌ బిన్‌ మహ్మద్‌, మెకానికల్‌ సూపరింటెండెంట్‌ జయరాం, ఎలక్ట్రిషియన్‌ కేవీఎస్‌ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. టీఎస్‌ఆర్టీసీ రేడియో ప్రయాణీకుల‌ను అల‌రించ‌నుంద‌ని సజ్జనార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉప్పల్-సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌-సికింద్రాబాద్‌, గచ్చిబౌలి-మెహిదిపట్నం, సికింద్రాబాద్‌-పటాన్‌చెరువు, కూకట్‌పల్లి-శంకర్‌పల్లి, కొండాపూర్‌-సికింద్రాబాద్‌, కోఠి-పటాన్‌చెరు, ఇబ్రహింపట్నం-జేబీఎస్‌ మార్గాల్లో న‌డిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని సజ్జనార్‌ తెలిపారు. ఆయా బస్సుల్లో ఈ రోజు నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు.

సైబర్​, ఆర్థిక నేరాలపై అవగాహన కార్యక్రమాలు: మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే, ఈ రేడియో ద్వారా మహిళ, పిల్లల భద్రత, సైబర్‌, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సజ్జనర్‌ తెలిపారు.

ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్‌ కోడ్​లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్‌ కోడ్​ను స్మార్ట్ ఫోన్‌లో స్కాన్‌ చేసి.. రేడియోపై ఫీడ్‌బ్యాక్​ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ స‌రికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని సజ్జనార్‌ కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.