Low Pressure Formed in the Bay of Bengal : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబరు 30న వాయుగుండంగా మారింది. అనంతరం అది వాయువ్య దిశగా కదిలి డిసెంబరు 2న ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ సంచాలకులు ఓ ప్రకటన తెలిపారు. సోమవారం ( నవంబరు 4న) సాయంత్రం చెన్నై-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ తుపాను కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. తుపాను ప్రమాదం పొంచి ఉండటంతో మత్య్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొవద్దని ఒకవేళ వెళ్లిన వెంటనే వెనక్కి తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేశారు.
తుపాను కారణంగా ఆదివారం (నవంబరు 3) నుంచి మంగళవారం (నవంబరు 5) వరకు భారీ వర్షాలు పడే నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర సాయం, సమాచారం కోసం 1070,112,18004250101 నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా తెలిపింది. ఇప్పటికే జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రైతులు, కూలీలు, మత్య్సకారులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.
తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం - రేపు తీరం దాటనున్న 'మిథిలి'
Rains in Different Parts of the State : కోస్తాంధ్ర, రాయలసీమలోని పలుప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడినా అల్పపీడనం కారణంగా నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూరులో 8.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Crop Loss Due to Rain : ఈ సంవత్సరం ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో ఆలస్యంగా ప్రవేశించడంతో వర్షాధారిత ప్రాంతాల్లో పంటలు వేయలేదు. మరోవైపు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. చేతికొచ్చే దశలో పెట్టుబడులు నేల పాలయ్యాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం సమీక్ష: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు. ఏపీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు సీఎస్ వెల్లడించారు. తుపాను ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని సీఎస్ వివరించారు. అలాగే తీరప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని సీఎస్ తెలిపారు.
ఈ నెల 4 తేదీ సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్టు అంచనా ఐఎండీ అంచనా వేస్తున్నట్టు వివరించారు. మరోవైపు తీరప్రాంత జిల్లాల్లోని మత్స్యకారులెవరూ శనివారం ఉదయం నుంచి సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు వివరించారు. అలాగే తీరప్రాంతాల్లో తుపాను నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అటు తూర్పు నౌకాదళ కమాండ్ కూడా అత్యవసర సామాగ్రి, నౌకలతో సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.
అలాగే తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో పౌరసరఫరాల విభాగం ద్వార నిత్యావసర సరుకులు కూడా అందించేలా చర్యలు చేపట్టామన్నారు. నీటిపారుదల, రహదారులు భవనాలు, పంచాయితీరాజ్ శాఖలను అప్రమత్తం చేసినట్టు సీఎస్ వివరించారు. ఏటిగట్లు, వంతెనలు తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు వివరించారు. రక్షిత మంచినీటి సరఫరా, విద్యుత్,టెలికం, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులను కూడా పూర్తిగా అప్రమత్తం చేశామని చెప్పారు.
Heavy Rain in Nellore : నెల్లూరులో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షపు నీరు, మరోవైపు మురుగు వల్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడంతో రహదారిపై అడుగు ఎత్తులో వర్షపు నీరు ప్రవహించింది. అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు ఉద్ధృతిగా ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాలో నాలుగు నుంచి ఆరు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Heavy Rain in Tirupathi : గతకొద్దిరోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు చిరుజల్లులు, మరోవైపు చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు అష్టాకష్టాలను అనుభవిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీకాళహస్తిలో భారీ వర్షం పడటంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
క్రిమియాలో తుపాను బీభత్సం- స్తంభించిన జనజీవనం, అంధకారంలో 5లక్షల ప్రజలు