ETV Bharat / state

JAI BHEEM నోటీసుల అంశంపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తాం.. జైభీమ్ జడ శ్రావణ్‌కుమార్ - Jai Bheem Bharat Party today news

JAI BHEEM BHARAT PARTY MEETING UPDATES: న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జైభీమ్‌ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. సీఐడీ నోటీసులు ఇచ్చేంత తప్పు తామేం చేశామని ప్రశ్నించారు. దర్యాప్తు పేరుతో వేధించి ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరూ రోడ్డుపైకి రాకూడదని జీవో 1 తెచ్చారని ఆక్షేపించారు. నిరసన తెలిపేందుకు రోడ్డుపైకి వస్తామన్న ఆయన...కావాలంటే అరెస్టు చేయండని సవాల్‌ విసిరారు.

JAI BHEEM
JAI BHEEM
author img

By

Published : Apr 22, 2023, 10:05 PM IST

Updated : Apr 22, 2023, 10:23 PM IST

JAI BHEEM BHARAT PARTY MEETING UPDATES: ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదులుగా, చార్టర్డ్ అకౌంటెంట్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్‌ కుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, నోటీసులు జారీ చేసిన సీఐడీ పోలీసులపై కూడా ప్రైవేట్ కేసు వేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తుందన్న ఆయన.. సీఐడీ అధికారుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం.. న్యాయవాదులకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఈరోజు జైభీమ్ భారత్ పార్టీ న్యాయ విభాగం అధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. న్యాయవాదుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అధికారం ఉందని ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి, డీజీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో న్యాయవాదులను పిలిచి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోపెట్టి, ప్రభుత్వం ఆనందం పొందాలని చూస్తోందని ఆవేదన చెందారు. సీఐడీ నోటీసులు ఇచ్చేంత తప్పు తామేం చేశామని ప్రశ్నించారు.

ఇదెక్కడి పాలన..ఇదేం పరిపాలన.. జడ శ్రావణ్‌ కుమార్ మాట్లాడుతూ.. ''తప్పు ముఖ్యమంత్రి జగన్ చేసినా, రామోజీరావు చేసినా చర్యలు తీసుకోవచ్చు. వారు తప్పు చేశారో లేదో న్యాయస్థానంలో నిరూపణ అవ్వాలి. అప్పటివరకు వారు అభియోగాలను మాత్రమే ఎదుర్కొంటారు. న్యాయవాదులకు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పదుల సంవత్సరాల నుంచి మార్గదర్శి వ్యాపారం చేస్తోంది. ఏ రోజు, ఏ ప్రభుత్వం కూడా అక్రమాలను ఫ్రూవ్ చేయాలేకపోయింది. అంటే దానికి అర్థం ప్రభుత్వాల అసమర్థతే కదా.. మీ ప్రభుత్వాలు అసమర్థత పాలన చేసి ప్రజల ప్రాథమిక హక్కుల మీద పడతారా.. మార్గదర్శిలో పనిచేస్తున్న మేనేజర్లలందర్నీ మూడు పూటల విచారణకు పిలిచి.. వారి ప్రాథమిక హక్కులకి భంగం కల్గిస్తారా.. రాష్ట్రంలో కొత్త కంపెనీలు రానీవ్వటం లేదు. ఒకవేళ వచ్చినా వాళ్లని రూ. 10 కోట్లు ఇస్తావా, రూ. 50 కోట్లు ఇస్తావా అంటూ బేరాలు అడుతున్నారు. అందులో మళ్లీ జగన్ పేరిట ట్యాక్స్, సజ్జల పేరిట ట్యాక్స్, భారతి పేరిట ట్సాక్సీలు కట్టాలని రూల్స్ పెట్టారు. అందుకే ఎవరూ ముందుకు రావటం లేదు.'' అని ఆయన అన్నారు.

ఒక్కరిని ఇబ్బంది పెట్టినా అందరం స్పందిస్తాం.. న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్‌లకు నోటీసులు ఇచ్చి సీఐడీ అధికారులు చాలా తప్పు చేశారని.. ఫ్రొఫిషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు పేర్కొన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్‌లను అరెస్ట్ చేయాలంటే.. అంత సులువు కాదన్నారు. సీఐడీ అధికారులను తాను బెదిరించానని, అందుకే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇంతకంటే దారుణం మరోకటి ఉండదన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్‌లు అందరూ ఒక్కటేనని, తమలో ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని చూసిన అందరూ ఏకతాటిపైకి వస్తారని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో ఆర్థం కావడం లేదు.. ఆధారాలు లేకుండా నోటీసులు అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న సంకల్పంతోనే.. జాడ శ్రావణ్ కుమార్ కృషి చేస్తున్నారని న్యాయవాదులు గ్రేసీ, సుజాత తెలిపారు. దళిత, బహుజనులకు అండగా వారి తరుపున పోరాటం చేస్తున్నారని, అంటువంటి వ్యక్తికీ సీఐడీ నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఆయనకు ఎందుకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను అరెస్ట్ చేసే విధానం సరైనది కాదని, ఆధారాలు లేకుండా సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. శ్రావణ్‌ కుమార్ ఆధారాలు ఇస్తే సీఐడీ పోలీసులు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో ఆర్థం కావడం లేదన్నారు.

ఇది ఎంత వరకు సమంజసం.. 'న్యాయవాదులకు 160 సీఆర్‌పీసీ పేరుతో నోటీసులు ఇచ్చి, ఒక వ్యక్తి తప్పు చేయలేదని అంటున్నారు కదా.. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు అడగడం దారుణం' అని.. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థపక ఆధ్యక్షులు జడ శ్రావణ్‌ కుమార్ తెలిపారు. మార్గదర్శికి ఎవరు అనుకులంగా మాట్లాడినా వారికి నోటీసులు ఇస్తున్నారని.. ఇది ఎంత వరకు సమంజసమో పోలీసులు ఆలోచించాలన్నారు. రూ. 40 వేల కోట్లు ఈడీ అటాచ్ చేసింది.. లక్ష కోట్ల అవినీతి చేశారని 16 సీబీఐ కేసులు పెట్టారని తెలిపారు. జగన్ తప్పు చేయలేదని ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, వైసీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు కదా.. మరి ఆధారాలు కావాలని సీఐడీ వారికి నోటీసులు ఇస్తుందా..? అని ప్రశ్నించారు. జగన్ నిర్ధోషి అని చెబుతున్నవారికి 160 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని తాము సీబీఐకి లేఖ రాస్తామన్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 22, 2023, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.