Jada Sravan Sensational Comments on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విశాఖలోని ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా 'డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నాను. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుంది. ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తాను' అని చేసిన వ్యాఖ్యలపై.. జైభీమ్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి కపట ప్రేమను ఒలకబోస్తున్నారని, రాజధాని పేరిట మరోసారి ప్రజలను వంచించి వేల ఎకరాల భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.
Jada Sravan on AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో జైభీమ్ భారత్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని.. ఆ పార్టీ వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ఆర్థిక నేరస్థులు, క్రిమినల్స్‌ను రాజకీయాల నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ విశాఖ వెళ్లే ముందు రాజధానికి భూములిచ్చిన రైతులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్న శ్రావణ్.. బినామీ భూముల విలువ పెంపునకు జగన్ విశాఖ వెళ్తున్నారని ఆరోపించారు.
Jada Sravan Comments: ''ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి కపట ప్రేమను ఒలకబోస్తున్నారు తప్ప..అతని మాటల్లో వాస్తవం లేదు. రాజధాని పేరిట మరోసారి ప్రజలను వంచించి, వేల ఎకరాల భూములను కబ్జా చేసేందుకు కుట్రపన్నుతున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వ్యవహరిస్తే న్యాయస్థానాలను ఉపేక్షించబోవు. ఖచ్చితంగా కొరడా ఝళిపిస్తాయి. అతని తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని 2006 నుంచి విశాఖ భూములపై కన్నేసిన జగన్.. అతని అనుచరుల ద్వారా వేల ఎకరాలు కొనుగోలు చేయించాడు. సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విశాఖ తరలి వెళ్లాలనే తహతహతతో అతని మనసులోని భావనను బయటపడనీయకుండా 2019 డిసెంబరులో మూడు రాజధానులు నాటకానికి తెర తీశారు.'' అని జడ శ్రావణ్ కుమార్ అన్నారు.
Jada Sravan Fire on Cm Jagan: డిసెంబరులోగా సీఎం జగన్ ఒకవేళ విశాఖ వెళ్తే.. ఆ తర్వాత మూడు నెలల్లో వేల ఎకరాల భూములు కబ్జా కావడం ఖాయమని జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో వందల సాఫ్ట్‌వేర్ కంపెనీలను పారద్రోలారని, ఓ కాల్ సెంటర్‌ను ఖాళీ చేయించారని ఆగ్రహించారు. పట్టుమని పది ఉద్యోగాలు కూడా ఇప్పించలేని ఈ సీఎం.. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రపై ప్రేమ ఉందంటే నమ్మశక్యమేనా..? అని ప్రశ్నించారు.
దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చేసింది ఏంటి..?. పచ్చని కొండ (రుషికొండ)ని కూల్చేసి సీఎం నివాసానికి విలాసవంతమైన భవనం నిర్మించుకుంటుంటే అతన్ని పేద ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తుండడం హాస్యాస్పదం. భస్మాసురుడి తరహాలో జగన్ రెడ్డి కాలుపెట్టిన చోటంతా శ్మశాన వాతావరణమే అవుతోంది. అమరావతి రూపు రేఖలను చిద్రం చేశారు. ఇప్పటికే విశాఖ అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొంది.-జడ శ్రావణ్ కుమార్, జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు.