ETV Bharat / state

కోర్టును సంప్రదించకుండా బదిలీ ఎలా చేస్తారు: ఏపీ హైకోర్టు - Andhra news

Transfer of APAT employees : ఏపీఏటీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న వారిని.. కోర్టును సంప్రదించకుండా బదిలీ చేయడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను అడగకుండా బదిలీలపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ఏజీని ప్రశ్నించింది. బదిలీ లేఖ ఇవ్వడం తప్పేనని అంగీకరించిన అడ్వొకేట్ జనరల్‌ దీనిపై ధర్మాసనాన్ని క్షమాపణ కోరుతున్నామని చెప్పారు. ఉద్యోగుల బదిలీ లేఖను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

AP High Court
ఏపీ హైకోర్టు
author img

By

Published : Dec 14, 2022, 7:27 AM IST

కోర్టును సంప్రదించకుండా బదిలీ ఎలా చేస్తారు

Transfer of APAT employees : ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్‌ ఏపీఏటీ నుంచి డిప్యుటేషన్‌పై హైకోర్టుకు వచ్చి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని.. హైకోర్టును సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు లేఖ ఇవ్వడం తప్పిదమేనని.. అడ్వొకేట్‌ జనరల్‌ ధర్మాసనానికి నివేదించారు. అందుకు క్షమాపణ కోరుతున్నామని తెలిపారు. ఆ లేఖను ఉపసంహరించినట్లుగా భావించాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పరిపాలన విభాగంతో ప్రభుత్వం చర్చిస్తోందని చెప్పారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది.

ఏపీఏటీ ని రద్దు చేశాక అక్కడి నుంచి డిప్యుటేషన్‌పై హైకోర్టుకు వచ్చి 70 మంది సేవలందిస్తున్నారు. వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రక్రియను సవాల్ చేస్తూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టును సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ఉపసంహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీ ప్రక్రియను నిలుపుదల చేసింది. మంగళవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. ధర్మాసనం స్పందిస్తూ 2019 నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు హైకోర్టులో పనిచేస్తున్నారని.. వారితో తమకు అనుబంధం ఏర్పడిందని పేర్కొంది.

హైకోర్టును సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం బదిలీపై నిర్ణయం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించింది. ఉద్యోగులు సైతం నేరుగా ప్రభుత్వానికి ఎలా లేఖ రాస్తారని అడిగింది. నేరుగా ప్రభుత్వాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో వారు క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని పేర్కొంది. ఇది ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వ్యవహారం కాదని.. హైకోర్టుతో ముడిపడిన విషయమని ధర్మాసనం గుర్తుచేసింది.

ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌కు వెళ్లేందుకు.. ఓ ఉద్యోగిని అనుమతించాలని సీనియర్‌ న్యాయవాది శ్రీధరన్‌ అభ్యర్థించారు. దయచూపాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం దయాదాక్షిణ్యాలపై కేసులు విచారించబోమని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలనే తాము చూస్తామని వ్యాఖ్యానించింది. కేసులో దమ్ముంటే న్యాయస్థానమే ఉత్తర్వులు ఇస్తుందని తెలిపింది. ఉద్యోగ నిమిత్తం అందరూ హైదరాబాద్‌ వెళ్లాలనే కోరుకుంటున్నారని.. విజయవాడలో ఉన్నవారు మనుషులు కాదా అని వ్యాఖ్యానించింది. విచారణను జనవరి 2కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.