Henceforth cbse syllabus for all classes: వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 7 తరగతులకు సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతిలో అమలు చేస్తుండగా.. ఇక మొత్తం అన్ని తరగతులకు సీబీఎస్‌ఈ పుస్తకాలనే అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 1 నుంచి 7 తరగతులకు గణితం, ఆంగ్ల పాఠ్యపుస్తకాలు, 6, 7 తరగతులకు సామాన్యశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి కొత్త పుస్తకాలు ఇస్తారు. సాంఘిక శాస్త్రం మాత్రం రాష్ట్ర సిలబస్ ఇస్తారు. ఇందులో ఏపీ చరిత్ర ఉంటుంది.
సీబీఎస్ సిలబస్‌లో దేశ చరిత్ర మాత్రమే ఉంటుంది. అందుకే సాంఘిక శాస్త్రం వరకు రాష్ట్ర సిలబస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎన్‌సీఈఆర్టీ సూచించిన సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాలను అందిస్తారు. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతికి వీటినే అందిస్తారు. రాబోయే రోజుల్లో అన్ని తరగతులకు సీబీఎస్‌ఈ పుస్తకాలు ఇచ్చినా.. బోర్డు అనుమతి లేని బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం రాష్ట్ర బోర్డే పరీక్షలు నిర్వహిస్తుంది.
ఇవీ చదవండి: