Balu Naik Appointed as Engineer in Chief of Panchayat Raj Department: పంచాయితీరాజ్ శాఖ ఈఎన్సీ నియామకాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా సీవీ సుబ్బారెడ్డిని నియమించి 24 గంటలు గడవకముందే ఆ నిర్ణయాన్ని మార్చుకుని మరో జీవో విడుదల చేశారు. పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పూర్తి అదనపు బాధ్యతలను సీనియారిటీ లిస్టు ప్రకారం ఎస్టీ వర్గానికి చెందిన చీఫ్ ఇంజనీర్ బాలూ నాయక్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న సీనియారిటీ లిస్టును పక్కన పెట్టి ఈఎన్సీగా సీవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనిపై మీడియాలో కథనాలు రావటంతో ఒక్క రోజులోనే ఆయన్ను తప్పించి బాలు నాయక్‌కు పంచాయితీరాజ్ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు.
ఇవీ చదవండి: