Godavari Express derailed :Godavari Express derailed: అది గోదావరి ఎక్స్‌ప్రెస్. ప్రయాణికులతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. తమ గమ్యస్థానం దగ్గరపడుతుండటంతో అప్పటి వరకు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులంతా అప్పుడప్పుడే మెల్లిగా నిద్ర లేస్తున్నారు. రాత్రంతా ఏవేవో కలల్లో తేలియాడిన వారంతా.. కలల్లోంచి నిజ జీవితంలోకి వస్తున్నారు. కొందరేమో వేకువజామునే లేచి ఇళ్లకు వెళ్లేందుకు అందంగా అద్దాల ముందు రెడీ అవుతున్నారు. మరికొందరేమో తమ వెంట తెచ్చుకున్న లగేజీని జాగ్రత్తగా ఒక్కచోట సర్దుకుంటున్నారు. ట్రైన్ దిగడమే ఆలస్యం.. లేట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోయి ఎవరి పనులకు వారు వెళ్లిపోవాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ట్రైన్ కాసేపట్లో సికింద్రాబాద్ స్టేషన్ రాబోతుంది. ప్రయాణికులు రాబోయే స్టేషన్‌లో దిగిపోవటానికి రెడి అవుతున్నారు.
Godavari Express derailed at Bibinagar : ఇలా రైలులో ఉన్నవారంతా ఎవరి ఆలోచనల్లో వారు బిజీగా ఉండగా.. ఒక్కసారిగా ఏదో ఊహించని కుదుపు వారి ఆలోచనలన్నింటికీ బ్రేక్ వేసింది. వారు ఊహించని హఠాత్పరిణామం ఎదురైంది. ఏమైందో అర్థం అయ్యేలోపే రైలులో ఉన్న వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ఇంతలో ఆగకూడని ప్రదేశంలో ట్రైన్ ఆగిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా ట్రైన్‌లో ఉన్న వారంతా భయంతో కిందకు దిగారు. అప్పుడు అర్థమైంది వారికి ట్రైన్ ప్రమాదానికి గురైందని.
తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఊహించని ఘటనతో రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్ వెంటనే ట్రైన్‌ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా రైలులోంచి కిందకు దిగేశారు.
ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. కిందపడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులందరినీ గమ్యస్థానాలకు చేర్చాం. మిగతా 15 బోగీలను హైదరాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ-మహబూబ్‌నగర్ స్పెషల్ ట్రైన్ బీబీనగర్ స్టేషన్‌లో నిలిపివేశాం. ఈ మార్గం గుండా వెళ్లే మరిన్ని రైళ్లు ఆలస్యంగా వెళ్లే అవకాశం ఉంది'' అని వివరించారు.
ఇవీ చదవండి :