ETV Bharat / state

బిందెలో ఇరుక్కున్న బుడ్డోడు, బయటికి తీసేందుకు ఎన్ని తిప్పలో - Boy stuck in meteal pot in andhrapradesh

Boy stuck పిల్లలు చేసే సరదా పనులు అప్పుడప్పుడు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు తలనొప్పిని తెప్పిస్తుంటాయి. వారికి లోకజ్ఞానం లేకపోవడమో లేదా ప్రమాదమని తెలవకపోవడం చేత కొన్నిసార్లు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. అలాంటి సంఘటనే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.

A boy stuck in a bin in
పాపం బుడ్డోడు బిందెలో ఇరుక్కున్నాడు
author img

By

Published : Aug 28, 2022, 1:31 PM IST

Updated : Aug 29, 2022, 12:36 PM IST

Boy stuck in brass vessel: ఓ బాలుడి సరదా ఆ పిల్లాడితో సహా అక్కడున్న వారిని కాసేపు ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటిదాకా ఆడుకుంటున్న బాలుడు ఆకస్మాత్తుగా ఓ బిందెలో ఇరుక్కుపోయాడు. ఆ పిల్లాన్ని బయటికి తీసేందుకు ఓ ప్రాహాసనమే జరిగింది. ఈ విచిత్ర సంఘటన ఎన్​టీఆ​ర్ జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన చెందిన బండి వీరాస్వామి ఇంట్లో ఇటీవల శుభకార్యం జరిగింది. ఈ వేడుకకు వీరాస్వామి సోదరి అరుణ తన నాలుగేళ్ల కుమారుడు విక్రమ్​తో కలిసి హాజరైంది. రెండు రోజులు పుట్టింట్లో కుటుంబసభ్యుల మధ్య ఉందామనుకుని అక్కడే ఉండిపోయింది. ఇంట్లోని వారంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అదే సమయంలో విక్రమ్ ఆడుకుంటూ బిందెలో దిగాడు.

సరదాగా బిందెలో దిగి ఆడుకుంటుండగా.. నడుము వరకు లోపలికి వెళ్లడంతో అందులోనే ఇరుక్కుపోయాడు. తిరిగి బయటకు వద్దామంటే.. వీలు కావట్లేదు. ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాడు. ఇక బయటకు వచ్చే మార్గం లేక బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఎంతకీ వీలు కాలేదు. స్థానికులు బ్లేడ్ కట్టర్ సాయంతో బిందెను సగానికి కోసి బాలుడిని బయటకు తీశారు. బిందెలోంచి విక్రమ్ బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పాపం బుడ్డోడు బిందెలో ఇరుక్కున్నాడు

ఇవీ చదవండి:

Last Updated : Aug 29, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.