R5 Zone in capital region: వంశపారంపర్యంగా వచ్చిన సారవంతమైన భూములను ప్రజలందరి బాగు కోసం తృణపాయంగా ఇస్తే, తమను ఇబ్బందిపెట్టడం ఎంత వరకు సమంజసమని రాజధాని రైతులు ప్రశ్నించారు. త్యాగంతో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ పురోగతిలో పయనిస్తుందని ఆశిస్తే..., జగన్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసి మూడున్నరేళ్లు అవుతోందని, దాని గురించి ఆలోచించకుండా.. మాస్టర్ ప్లాన్‌ను వీలైనంత మేర నాశనం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. బృహత్ ప్రణాళికలో చేసిన సవరణలపై సీఆర్డీఏ రైతుల నుంచి అభ్యంతరాలు వరుసగా 8వ రోజూ విజయవాడలో కొనసాగాయి.
R5 zone: రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన 10 వేల ఎకరాల్లో.. 901 ఎకరాల్లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఇటీవలే సీఆర్‌డీఏ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేపట్టింది. దాన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా అమరావతి బృహత్ ప్రణాళికలో మార్పులు చేసే ప్రయత్నం చేసింది. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలో 901 ఎకరాల్లో బలహీనవర్గాల గృహనిర్మాణానికి.. ఆర్-5 పేరుతో కొత్త రెసిడెన్షియల్ జోన్‌ను ప్రతిపాదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు. బృహత్ ప్రణాళికలో చేసిన సవరణలపై సీఆర్డీఏ రైతుల నుంచి అభ్యంతరాలు వరుసగా 8వ రోజూ విజయవాడలో కొనసాగాయి.
ఇవీ చదవండి: