ETV Bharat / state

వడగళ్ల వాన బీభత్సం.. ఆందోళనలో అన్నదాత - Roads turned like a white carpet due to hailstorm

Heavy rains across the state: రాష్ట్రంలో వడగళ్ల వాన, గాలి బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు కురవడంతో రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. పెద్దఎత్తున కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతినగా.. గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి.

Heavy rains across the state
Heavy rains across the state
author img

By

Published : Mar 19, 2023, 7:27 AM IST

Updated : Mar 19, 2023, 12:52 PM IST

వడగళ్ల వాన బీభత్సం.. ఆందోళనలో అన్నదాత

Heavy rains across the state: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పడించిన పంట చేతికి రావడానికి రైతులు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. ఈ అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పడుతున్న భారీ వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన మిరప తడిచిపోయింది. పంట చేతికి వచ్చే దశలో వేసిన పంటలు నేలవాలాయి.

అనంతపురం జిల్లావ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. శింగనమల మండలంలో వడగండ్ల వాన కురిసింది. రోడ్లపై మంచు మాదిరిగా వడగళ్లు పేరుకుపోయాయి. అకాలంగా కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. మమిడి చెట్లు కూలిపోవడంతోపాటు.. పెద్దపెద్ద కొమ్మలు విరిగిపడ్డాయి. గుంతకల్లులోనూ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. కొద్దిరోజుల్లోనే పంట చేతికొస్తుందనుకుంటుండగా.. గాలివాన తీవ్ర నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

కడప జిల్లా.. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలో వర్షం దంచికొట్టింది. దీంతో పట్టణంలోని రోడ్డులు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు వేంపల్లె పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక గండి రోడ్డులో వేప చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.. మండల పరిధిలోని వేంపల్లి, అమ్మగారి పల్లి గ్రామంలోనూ ఇదే మాదిరిగా వడగళ్ల వర్షం దంచికొట్టింది. ఈ వడగళ్ల వర్షాలకు గ్రామంలో అరటి తోటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తుఫాను కారణంగా కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే రైతులు మాత్రం నష్టం కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ జిల్లా.. మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా వ‌డ‌గ‌ళ్ల వాన బీభ‌త్సం సృష్టించింది. దీంతో ఎక్క‌డా చూసినా వ‌డగ‌ళ్ల కుప్ప‌లే క‌నిపించాయి ప‌లు ప్రాంతాలు క‌శ్మీర్​​ను త‌ల‌పించాయి. రోడ్లు జలమయిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

ప్రకాశం జిల్లాలో.. తీరం సమీపంలో ఉన్న ఉప్పు కోటార్లు అకాల వర్షాలకు నీట మునిగాయి.. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయానికి కురిసిన వర్షాలకు ఉప్పంతా కరిగి తీవ్ర నష్టం ఏర్పడిందని, రైతులు వాపోతున్నారు.. కొత్తపట్నం, నాగులప్పలపాడు తదితర మండలాల్లో బకింగ్‌ హోమ్‌ కెనాల్‌కు ఆనుకొని ఇరువైపులా వందలాది ఎకరాలు ఉప్పు కొటార్లు ఉన్నాయి.. భూ గర్భంలో ఉన్న ఉప్పునీటి ని విద్యుత్తు మోటార్లుతో తోడి మడుల్లో నింపి ఉప్పును సాగు చేస్తారు.. మార్చి, ఏప్రెల్‌ నెలల్లో ఈ సీజన్​కు సంబంధించిన ఉప్పు పంటకొస్తుంది.. దీన్ని సేకరించి విక్రయిస్తారు.. మంచి సీజన్‌ , మార్కెట్‌ బాగుందనే సమయానికి వర్షాలు కురవడం వీరిని తీవ్ర నష్టాలకు గురిచేసింది.. ఒక పంట కాలం వృధా అయ్యిందని ఎకరాకు పెట్టిన పెట్టుబడి దాదాపు 30వేల వరకూ నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో.. ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. పార్వతీపురం, పాలకొండ, బలిజపేట, కురుపాం, వీరఘట్టంలో భారీ వర్షం కురిసింది. వీరఘట్టం మండలంలో ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి.

అనకాపల్లి జిల్లా.. నర్సీపట్నంలో భారీ వర్షానికి నూకాలమ్మ దేవాలయం జలమయమైంది. దర్శనానికి వచ్చిన భక్తులు వర్షపునీటిలో అవస్థలు పడాల్సి వచ్చింది. నర్సీపట్నం డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నెల్లూరు జిల్లాలో.. ముమ్మరంగా వరి కోతలు సాగుతున్నాయి. మనుబోలు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం , విడవలూరు, బోగోలు, వెంకటాచలం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు నిన్నటి నుంచి రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం.. కల్లాలో ఉన్న ధాన్యం తడిసి పొయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా.. రంపచోడవరం మండలాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు, భూపతి పాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం, మద్ది గడ్డ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. రంపచోడవరం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిలో కొన్నిచోట్ల నీరు నిలిచిపోయింది. రంపచోడవరంలో ఐటీడీఏ సీ క్వార్టర్స్, ఎర్రం రెడ్డి నగరం జలమయమయింది. నీతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బొర్నగూడెం గ్రామంలో తెల్లవారుజాము పడిన భారీ వర్షంతో పునరావాస కాలనీ నీటితో నిండింది.

శ్రీ సత్యసాయి జిల్లా.. కదిరి రైల్వేస్టేషన్‌ వద్ద ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి ఓ భారీ వృక్షం రైలు పట్టాలపై పడిపోయింది. పట్టాలపై చెట్టును గుర్తించి రైలును ఆపేయటంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టాలపై చెట్టును తొలగించటానికి స్థానికులతో పాటు రైలులోని ప్రయాణికులు అరగంటకు పైగా శ్రమించారు. జిల్లాలోని పెనుకొండ మండలంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వడగండ్ల వర్షానికి పలుచోట్ల మొక్కజొన్న, మునగ, టమోటా పంటలు రైతులు నష్టపోయారు. మండల వ్యాప్తంగా 100 ఎకరాల పైబడి మొక్కజొన్న పంట నేలకొరిగింది. మునగ, టమాటా, కలింగర పంటలు వడగండ్ల వర్షానికి పూర్తిగా నష్టపోయి రైతులకు తీరని నష్టం మిగిల్చింది. భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొలవడంతో శనివారం సాయంత్రం నుంచి గ్రామాల్లో అంధకారం నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం 15 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.

సీఎం జగన్​ ఆదేశాలు.. రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం జగన్‌ సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. వారంరోజుల్లో ఈ ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లుకు ఆదేశాలు జారీచేయాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 19, 2023, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.