ETV Bharat / state

వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ రోగం.. కఠిన చర్యలేవీ? - Assault by fellow students

Ragging in medical colleges: వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్‌? తప్పనిసరిగా సర్‌ అనే పిలవాలి. క్యాంటీన్‌కెళ్లి బిర్యానీ పట్టుకురా.. బయటికెళ్లి మద్యం సీసాలు తీసుకురా.. ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవద్దు.. మేం ఆపమనే వరకూ గుంజీలు తీయి.. ఎవరికైనా ఫిర్యాదు చేశారో.. అంతే! మున్ముందు మాతోనే మీకు పని! జాగ్రత్త!’’.. ఇదీ వైద్య కళాశాలల్లో సీనియర్‌ వైద్య విద్యార్థుల జులుం. కొత్తగా కళాశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల పట్ల కొందరు సీనియర్లు సరదా పరిచయాల పేరిట వికృతచేష్టలకు పాల్పడుతున్నారు.

Ragging in medical colleges
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ రోగం
author img

By

Published : Nov 30, 2022, 10:18 AM IST

Ragging in medical colleges: వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్‌? తప్పనిసరిగా సర్‌ అనే పిలవాలి. క్యాంటీన్‌కెళ్లి బిర్యానీ పట్టుకురా.. బయటికెళ్లి మద్యం సీసాలు తీసుకురా.. ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవద్దు.. మేం ఆపమనే వరకూ గుంజీలు తీయి.. ఎవరికైనా ఫిర్యాదు చేశారో.. అంతే! మున్ముందు మాతోనే మీకు పని! జాగ్రత్త!’’.. ఇదీ వైద్య కళాశాలల్లో సీనియర్‌ వైద్య విద్యార్థుల జులుం.

కొత్తగా కళాశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల పట్ల కొందరు సీనియర్లు సరదా పరిచయాల పేరిట వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు అన్ని వైద్య కళాశాలల్లో ఉన్నా ర్యాగింగ్‌ యథేచ్ఛగా కొనసాగుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రరూపం దాల్చిందో అర్థమవుతోంది. ర్యాగింగ్‌ బెడదను తప్పించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పలు ఆదేశాలు జారీచేస్తున్నా సీనియర్‌ విద్యార్థులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ వికృతచేష్టలు రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

బరితెగింపు వ్యాఖ్యలు.. చేష్టలు: రెండు వారాల కిందట తరగతులు ప్రారంభం కావడంతో వైద్యకళాశాలల్లోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు విద్యార్థులు వసతిగృహాల్లో చేరిపోగా.. మరికొందరు బయటి నుంచి కళాశాలలకు హాజరవుతున్నారు. తరగతులు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభమే కాలేదు.. కానీ సీనియర్ల ఆగడాలు మాత్రం మొదలయ్యాయి. ముఖ్యంగా అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని చెలరేగిపోతున్నట్లు తెలుస్తోంది. వారు ధరించిన దుస్తులపైనా వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫలానా తరహా దుస్తులే వేసుకురావాలని ఆంక్షలు విధిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. సమాధానం సరిగా చెప్పకపోయినా.. వారి వ్యాఖ్యలను ప్రశ్నించినా.. సీనియర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయిదేళ్ల వైద్యవిద్యలో సీనియర్ల సాయం తప్పనిసరిగా అవసరమవుతుందనీ, క్షేత్రస్థాయి అనుభవ శిక్షణకు వెళ్లినప్పుడు తమ పాత్రే కీలకమవుతుందనీ, ఇప్పుడు ఎదిరిస్తే భవిష్యత్‌లో ఎలాంటి సహకారమూ ఉండదని కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.ఈ చేష్టలకు భయపడి కొందరు విద్యార్థినులు కళాశాలకు వెళ్లడానికే వణికిపోతున్నారు.

వసతిగృహాల్లో వికృతరూపాలు: వైద్యకళాశాలల వసతిగృహాల్లో ఉంటున్న వైద్యవిద్యార్థులపై సీనియర్ల నుంచి మరిన్ని వికృతరూపాల్లో ర్యాగింగ్‌ ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. రాత్రుళ్లు తమ గదికి పిలిపించుకొని అసభ్యంగా మాట్లాడటమే కాకుండా గుంజీలు తీయించడం, గోడకుర్చీ వేయించడం, దుస్తులు విప్పాలని బలవంతం చేయడం, రాత్రివేళ తమ కోసం ఆహారం, మద్యం సీసాలు కొనుక్కురమ్మని పురమాయించడం లాంటి చర్యలతో కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో కొత్త విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ప్రధానాచార్యుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. అవి తూతూమంత్రంగానే ఉంటుండటంతో.. ర్యాగింగ్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ర్యాగింగ్‌ జరుగుతున్నట్లు బయటకు పొక్కితే తమ కళాశాలకు చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో కొందరు ప్రధానాచార్యులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తొలిరోజుల్లోనే దీనికి అడ్డుకట్ట వేయకపోతే.. ఈ విషసంస్కృతి మరింతగా జడలు విప్పే ప్రమాదముంది.

శారీరకంగా వేధిస్తే ఏడాది జైలుశిక్ష:

  • కాళోజీ వర్సిటీ గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం దుస్తులపై వ్యాఖ్యానం, గుంజీలు తీయమనడం, పరుగులు పెట్టించడం, గోడ కుర్చీ వేయించడం, అసభ్యకరంగా, కించపర్చేలా మాట్లాడడం.. తదితర వేధింపులకు పాల్పడటం నేరం.
  • వసతిగృహాల్లో రాత్రివేళ తమ గదులకు పిలిపించుకోవడం.. జుట్టు కత్తిరించడం.. మద్యం సీసాలు తెమ్మని పురమాయించడం.. అశ్లీలంగా వ్యవహరించమని ప్రోత్సహించడం.. దుస్తులను విప్పమని బలవంతపెట్టడం అత్యంత తీవ్రమైన అంశాలు.
  • ర్యాగింగ్‌ వికృత క్రీడల్లో భాగస్తులైన విద్యార్థులకు నెల రోజుల పాటు వైద్యకళాశాల నుంచి సస్పెన్షన్‌ వేటు తప్పదు.
  • ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష ఉంటుంది.
  • శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష విధించే అవకాశముంది.
  • అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు.
  • అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా.
  • ర్యాగింగ్‌ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
  • ర్యాగింగ్‌ భూతాన్ని అడ్డుకోవడంలో ప్రధాన బాధ్యత సంబంధిత వైద్యకళాశాలదేే.
  • విద్యార్థులపై వికృత చేష్టలను అదుపు చేయడంలో వైద్యకళాశాల విఫలమైందని తేలితే.. సంబంధిత కళాశాల గుర్తింపును కనీసం ఏడాది పాటు రద్దు చేస్తారు.

ఇలా చేయాలి:

  • జాతీయ వైద్య కమిషన్‌ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ నిరోధక బృందాన్ని ఏర్పాటుచేయాలి.
  • బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఫిర్యాదు పెట్టె, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ అడ్రస్‌ వంటివి అందుబాటులో ఉంచాలి.
  • కొత్త, పాత విద్యార్థుల మధ్య ప్రత్యక్షంగా పరిచయం కలిగే పరిస్థితులను కల్పించొద్దు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షకు గురవుతారనే బోర్డులను కళాశాల ఆవరణలో ప్రదర్శించాలి.
  • స్థానిక పోలీసు అధికారుల మొబైల్‌ నంబర్లను ప్రదర్శించాలి.
  • ర్యాగింగ్‌ బారినపడిన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు సైకియాట్రీ సేవలు కల్పించాలి.
  • జాతీయ వైద్య కమిషన్‌ ఉత్తర్వుల ప్రకారం.. ర్యాగింగ్‌ చేయబోమని విద్యార్థి నుంచి, ఒకవేళ చేస్తే తీసుకునే కఠిన చర్యలకు కట్టుబడి ఉంటామని కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముందస్తుగా అఫిడవిట్‌ స్వీకరించాలి.
  • వైద్య కళాశాల, వసతిగృహాలు, భోజనశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.

"సీనియర్‌ విద్యార్థులు జూనియర్లకు ఆదర్శంగా ఉండాలి. అంతేగానీ ర్యాగింగ్‌ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదు. గతేడాది సూర్యాపేటలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కొందరు విద్యార్థులను సస్పెండ్‌ చేశాం. ఇటీవల సిద్దిపేటలోనూ కొందరు ర్యాగింగ్‌కు పాల్పడితే.. వారిని వసతిగృహం నుంచి పంపించాం. వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం. నిజానికి ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను సస్పెండ్‌ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకూడదనే మానవతా దృక్పథంతో వసతిగృహం నుంచి తప్పించామని వారి తల్లిదండ్రులకు వివరించాం. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎక్కడ ర్యాగింగ్‌ జరిగినట్లు తేలినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. సీనియర్లు ర్యాగింగ్‌ను వదిలిపెట్టి, జూనియర్లకు వైద్యవిద్యలో సహకరించాలి".-హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.