ఇవీ చదవండి:
ప్రభుత్వానికి చిత్తశుద్ది లేక.. రైతుకు భరోసా కరవై - ఈటీవీ భారత్
Difficulties in Procurement of Paddy: ఎన్టీఆర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి ధాన్యం నూర్చి పదిహేను రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని, మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం... తమను దగా చేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ప్రతినిధులు ధాన్యం కాటావేస్తే తేమ శాతం తక్కువ చూపిస్తుంటే.. ప్రైవేటు మిల్లర్లు కాటా వేసినప్పుడు మాత్రం తేమ శాతం ఎక్కువ చూపిస్తుందని వాపోతున్నారు. సమయానికి ధాన్యం కోనుగోలు చేయడం చేతకాని ప్రభుత్వం పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు గోనె సంచులు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు. వారాల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో ధాన్యం నిలువ చేసుకొని అధనంగా కూలీలను ఏర్పాటు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన చెందుతున్న రైతులతో ఈటీవీ భారత్ ప్రతినిధి కనకారావు ముఖాముఖి.
ఎన్టీఆర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో
ఇవీ చదవండి: